KL Rahul Retirement: కేఎల్ రాహుల్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా..ఆ పోస్టు అర్థమేంటీ?
KL Rahul Retirement : భారత జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా. తాజాగా ఆయన చేసిన ఓ పోస్టు పలు అనుమానాలకు తావిస్తోంది. రాహుల్ ఇంటర్నేషనల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా అని క్రికెట్ ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. దీనికి గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
KL Rahul Retirement : భారత జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఈ పోస్టు అర్థం కేఎల్ రాహుల్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లేనా అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. టీమిండియా తరపున ఎక్కువ మ్యాచుల్లో మంచి ఫార్ఫామెన్స్ చూపించిన బ్యాటర్లలో కేఎల్ రాహుల్ ఒగరుగా నిలిచారు. కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత ఆ లెవల్ కు వెళ్లిన ఆటగాడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
గత కొంతకాలంగా తన మీద పెట్టుకున్న అంచనాలను అందుకోవడంలో రాహుల్ విఫలమయ్యాడు. గాయం వల్ల కొన్నాళ్లు పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ మధ్యే శ్రీలంక తో జరిగిన వన్డే సిరీస్ తో జట్టులోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సిరీస్ లో కూడా రాహుల్ ఫెయిల్ అయ్యాడు. త్వరలోనే బంగ్లాదేశ్ తో జరగనున్న సిరీస్ లో ఆడుతాడని అంతా అనుకుంటున్నా వేళ రాహుల్ చేసిన పోస్టు ఆలోచింపజేస్తోంది.
రాహుల్ తన ఇంటర్నేషన్ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పనున్నాడా అనే సందేహాలు క్రికెట్ అభిమానుల్లో మొదలయ్యాయి. దానికి కారణం రాహుల్ ఇన్ స్టాలో తన అధికారిక ఖాతాలో పెట్టిన ఓ పోస్టు అని చెప్పవచ్చు. ఆ పోస్టులో ఓ ప్రకటన చేయబోతున్నాను..మీరు వేచి ఉండండి అంటూ రాసాడు. దీంతో ఈ పోస్టు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఈ పోస్టు చేసిన ఆయన అభిమానులు రాహుల్ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడా అంటూ స్క్రీన్ షాట్స్ తీసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరో ఫేక్ న్యూస్ కూడా వైరల్ అవుతోంది. ఇదంతా నిజం కాదని రాహుల్ అభిమానులు అంటున్నారు. మరి రాహుల్ నుంచి అధికారికంగా ప్రకటన వస్తేనే కానీ నిజం ఏంటో తెలియదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి