హర్భజన్ బౌలింగ్ యాక్షన్‌ను అచ్చు దించేసిన కోహ్లీ.. మైదానంలోనే పడిపడి నవ్వుకున్న భజ్జీ, ఇర్ఫాన్!
Virat Kohli doing Harbhajan Singh`s unique bowling action. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్‌ను భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ అనుకరించాడు.
Virat Kohli imitates Harbhajan Singhs bowling action: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాట్‌తో మైదానంలోకి దిగాడంటే.. పరుగుల వరద పారాల్సిందే, రికార్డులు బద్దలు అవ్వాల్సిందే. అయితే గ్రౌండ్‌లో కాస్త సీరియస్‌గా కనిపించే కోహ్లీ.. మైదానం బయట మాత్రం ఎంతో సరదాగా ఉంటాడు. భారత ఆటగాళ్లను ఎప్పుడూ సరదాగా ఆటపట్టిస్తుంటాడు. అంతేకాదు అప్పుడపుడు భారత బౌలర్ల యాక్షన్‌ను అనుకరిస్తుంటాడు. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ శైలిని అనుకరించిన విరాట్.. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్‌ను అచ్చు దించేశాడు.
ప్రస్తుతం భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2022 కోసం ఆస్ట్రేలియాలో ఉంది. ఈ నెల 16 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుండగా.. భారత్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో భారత బ్యాటర్లు, బౌలర్లు సాధన చేస్తున్నారు. విరాట్ కోహ్లీ కూడా బ్యాటింగ్ చేస్తూ చమటోడ్చుతున్నాడు. అయితే కోహ్లీకి సబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.
మ్యాచ్ సందర్భంగా ప్లేయర్స్ అందరూ మైదానంలో సాధన చేస్తుండగా.. విరాట్ కోహ్లీ, యుజ్వేంద్ర చహల్ కలిసి కామెంటేటర్లు ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్‌లతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా హర్భజన్ బౌలింగ్ యాక్షన్‌ను కోహ్లీ అనుకరించాడు. బౌలింగ్ చేసేముందు హర్భజన్ ఏ విధంగా సాధన చేస్తాడో కోహ్లీ చేసి చూపించాడు. బంతి వేసేందు భజ్జీ ఎలా అయితే ఫీల్డ్ సెట్ చేస్తాడో అలానే చేశాడు. అనంతరం హర్భజన్ బౌలింగ్ యాక్షన్‌ను అచ్చు దించేశాడు. దాంతో భజ్జీ, ఇర్ఫాన్ పగలపడి నవ్వుకున్నారు. ఇక్కడ కోహ్లీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
Also Read: Team India Dance: డాన్స్ చేసిన భారత ప్లేయర్స్.. అబ్బా అనిపించిన ధావన్!
Also Read: సిల్లీ కారణంతో.. జిమ్‌లో జట్టు పట్టుకుని తన్నుకున్న మహిళలు! వీడియో చూస్తే నవ్వులే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook