KS Bharat Receives Debut Cap in Border Gavaskar Trophy 2023 Today: తెలుగు కుర్రాడు, ఆంధ్ర రంజీ ప్లేయర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ చిరకాల కల నెరవేరింది. ప్రతిష్టాత్మక బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2023 సందర్భంగా భరత్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. టీమిండియా టెస్ట్ స్పెసలిస్ట్ చేతేశ్వర్ పుజారా చేతుల మీదుగా అతడు టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ఆస్ట్రేలియాపై  తొలి టెస్టు ఆడుతున్న కేఎస్‌ భరత్‌ జెర్సీ నంబర్‌ 14. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా భారత జట్టుకు వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం మనోడికి దక్కింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ తరఫున అరంగేట్రం చేసిన సందర్భంగా కేఎస్‌ భరత్‌ తన మనసులోని మాటలను పంచుకొన్నాడు. ఇందుకు సంబందించిన వీడియోను బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. వీడియోలో తెలుగు కుర్రాడు కేఎస్‌ భరత్‌ మాట్లాడుతూ... 'ఎన్నో ఏళ్ల ఎదురు చూపులకు ఇప్పుడు ఫలితం దక్కింది. టీమిండియా తరఫున ఆడటం ఆనందంగా ఉంది. ఇది నా కల మాత్రమే కాదు.. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. నా కుటుంబ సభ్యులు, నా భార్య, స్నేహితులు, కోచ్‌లు నిత్యం అండగా నిలిచారు. వారి మద్దతు లేకపోతే ఇంతవరకూ వచ్చి ఉండేవాడిని కాదు' అని అన్నాడు. 


'కోచ్‌ జె కృష్ణారావు నాలోని ఆటను గమనించి తీర్చిదిద్దారు. బ్యాటింగ్‌, కీపింగ్‌లో మెలకువలు నేర్పారు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు భారత జాతీయ జట్టుకు ఎంపిక అవుతాననుకోలేదు. 4-5 ఏళ్లు నిలకడగా రాణించడంతో ఇప్పుడు అవకాశం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. నా జీవితం రాకెట్‌ వేగంతో దూసుకురాలేదు. కష్టపడ్డా.. ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చా. భారత్ ఏ తరఫున ఆడేటప్పుడు కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌తో పరిచయం నాలో మార్పులు తెచ్చింది. ఆటతీరును అస్సలు మార్చుకోకు అని చెప్పారు. సవాళ్లను స్వీకరిస్తూ ముందుకు సాగాలన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోమని ద్రవిడ్‌ సర్ నిత్యం చెప్పేవారు. శ్రీలంకతో అలాగే ఆడా. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది' అని కేఎస్‌ భరత్‌ పేర్కొన్నాడు. 



2012లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున క్రికెట్‌ కెరీర్‌ను ప్రారంభించిన 29 ఏళ్ల కేఎస్‌ భరత్‌.. 2015లో ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు. ఇక 2023లో భారత టెస్ట్ జట్టులోకి వచ్చాడు. 2021లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భరత్‌కు టీమిండియా నుంచి తొలిసారి పిలుపు వచ్చింది. అయితే తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ సందర్భంగా భారత జట్టుకు ఎంపికైనా.. బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పటివరకు 79 ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచుల్లో 4,289 పరుగులు చేశాడు. ఇందులో 9 శతకాలు, 23 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 308. 



Also Read: సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగల్ ఛార్జింగ్‌తో 181 కిలోమీటర్లు! ఎగబడి కొంటున్న జనం


Also Read: Maruti Suzuki Cars Offers 2023: మారుతి కార్లపై బంపర్ ఆఫర్.. రూ.50,000 వరకు తగ్గింపు! 3 కార్లపై భారీ డిస్కౌంట్  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.