Sri Lanka To Appoint Lasith Malinga As Fast Bowling Coach : ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా దిగ్గజ పేసర్ లసిత్ మలింగను (Lasith Malinga) నియమించేందుకు సిద్ధమైంది శ్లీలంక జట్టు. ఆస్ట్రేలియా పర్యటన (Australia Tour) నేపథ్యంలో.. మలింగను కన్సల్టెంట్​ కోచ్​గా నియమించాలని హై-ప్రొఫైల్​ క్రికెట్​ అడ్వైజరీ కమిటీ శ్రీలంక క్రికెట్​ ఎగ్జిక్యూటివ్​ కమిటీకి సిఫార్సు చేసింది. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టీ20 మ్యాచ్​లు ఆడనుంది శ్రీలంక.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతేడాది అన్ని ఫార్మాట్లకు మ‌లింగ‌ రిటైర్మెంట్ ప్రకటించాడు. లంక తరఫున మొత్తంగా 546 వికెట్లు పడగొట్టిన మలింగ.. 2011లోనే టెస్టులకు గుడ్​బై చెప్పాడు. వన్డేలకు 2019లో వీడ్కోలు పలికాడు. 2021లో టీ20ల నుంచి తప్పుకున్నాడు. తన అంతర్జాతీయ కెరీర్ లో... 101 టెస్ట్ వికెట్లు, 338 వన్డే వికెట్లు,  107 టీ20లు వికెట్లు సాదించాడు మలింగ. ఐపీఎల్​లో​ మలింగ 170 వికెట్లు తీశాడు. 


Also Read: Chris Gayle: 'ప్రధాని మోదీ మెసేజ్ తో నిద్ర లేచా'..: క్రిస్‌ గేల్‌


అంతే కాకుండా తొమ్మిది వ‌న్డేల్లో శ్రీలంక జ‌ట్టుకు (Srilanka Team) నాయకత్వం వహించిన మలింగ ఒక్క సారి కూడా జ‌ట్టును గెలిపించ లేక‌పోయాడు. అదే విధంగా 24 టీ20ల్లో సార‌ధ్యం వ‌హించిన మలింగకు 15 సార్లు ప‌రాజ‌యం ఎదురైంది. ఇక అత‌డితో పాటు మహేల జయవర్ధనే కూడా కన్సల్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ల‌నున్నాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook