Lucknow Super Giants Vs Punjab Kings IPL Highlights: ఐపీఎల్ 2024 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్‌పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో లక్నోకు తొలి విజయం కాగా.. పంజాబ్‌కు వరుసగా రెండో ఓటమి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. డికాక్ (54), కెప్టెన్ నికోలస్ పూరన్ (42), కృనాల్ పాండ్యా (43 నాటౌట్) రాణించారు. అనంతరం పంజాబ్ జట్టు 178 పరుగులకే పరిమితమైంది. శిఖర్ ధావన్ (70), బెయిర్ స్టో (42) దుమ్ములేపడంతో ఓ దశలో పంజాబ్‌దే విజయం అనుకున్నారు. కానీ లక్నో తరఫున అరంగేట్రం చేసిన స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్.. బుల్లెట్ బంతులతో అదరగొట్టాడు. తన తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లు పడగొట్టి.. గేమ్ ఛేంజర్‌గా మారిపోయాడు. పంజాబ్ చేతుల్లోకి వెళ్లిన విజయాన్ని లాగేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: BAN Vs SL Test Highlights: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త డీఆర్ఎస్.. కళ్లు కనిపించలేదా భయ్యా..!  


లక్నో విధించిన 200 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌కు శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు దూకుడుగా ఆడుతూ లక్నో బౌలర్లను కంగారెత్తించారు. 11 ఓవర్లకు వికెట్ ఇవ్వకుండా తొలి వికెట్‌కు 102 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. లక్ష్యం వైపు దూసుకుపోతున్న పంజాబ్‌కు మయాంక్ యాదవ్ బ్రేకులు వేశాడు. 29 బంతుల్లో 42 పరుగులు చేసిన బెయిర్‌స్టోను ముందు పెవిలియన్‌కు పంపించాడు. క్రీజ్‌లోకి వచ్చి రాగానే బాదుడు మొదలు పెట్టిన ప్రభుసిమ్రాన్ సింగ్ (7 బంతుల్లో 19, ఒక ఫోర్, 2 సిక్సులు)ను పెవిలియన్‌కు పంపించాడు. ఆ తరువాత జితేశ్ శర్మ (6)ను కూడా ఔట్ చేసి లక్నోను రేసులో తీసుకువచ్చాడు. 


క్రీజ్‌లో పాతుకుపోయిన కెప్టెన్ శిఖర్ ధావన్ (50 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), సామ్ కర్రాన్ (0)ను మోహ్సిన్ ఖాన్ వరుస బంతుల్లో ఔట్ చేసి విజయాన్ని ఖాయం చేశాడు. గాయంతో ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేసిన లివింగ్ స్టోన్ (17 బంతుల్లో 28, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి ఓవర్‌లో మెరుపులు మెరిపించినా.. అప్పటికే పంజాబ్ ఓటమి ఖాయమైంది. పంజాబ్ బౌలర్లలో మయాంక్ యాదవ్ 3, మోహ్సిన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. 


అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో.. సొంత గడ్డపై భారీ స్కోరు చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిన కేఎల్ రాహుల్ (15) తక్కువ స్కోరుకే ఔట్ అయినా.. డికాక్ (38 బంతుల్లో 54, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్ములేపాడు. ఆ తరువాత పూరన్ (21 బంతుల్లో 42, ౩ ఫోర్లు, 3 సిక్సర్లు), కృనాల్ పాండ్యా (22 బంతుల్లో 43, 4 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో సామ్ కర్రాన్ 3, అర్ష్ దీప్ సింగ్ 2, రబడా, రాహుల్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు.


Also Read: Election Commission: డీఎస్సీ పరీక్షలు, టెట్ ఫలితాలు ఎన్నికలు ముగిసేవరకూ వాయిదా


Also Read:  Heat Waves: రానున్న 3-4 రోజుల్లో ఈ జిల్లాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలులు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి