ధోనీ సంగతి వారికే వదిలేద్దాం
`నేను ఏదైనా అభిప్రాయం చెబితే అది అందరినీ తికమక పెడుతుంది. కాబట్టి ధోనీ సెలెక్షన్ విషయాన్నీ సెలెక్టర్లకు వదిలేద్దాం` అని కపిల్ దేవ్ స్పందించారు.
ఎం ఎస్ ధోనీ జట్టులో కొనసాగాలా? వద్దా? అనే విషయంపై గతకొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. "నేను ఏదైనా అభిప్రాయం చెబితే అది అందరినీ తికమక పెడుతుంది. కాబట్టి ధోనీ సెలెక్షన్ విషయాన్నీ సెలెక్టర్లకు వదిలేద్దాం" అని అన్నారు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీలు ధోనీకి మద్దతుగా నిలిచారు. మాజీ క్రికెటర్ వి. వి. ఎస్. లక్ష్మణ్, అజిత్ అగార్కర్ సహా మరికొందరు మాత్రం ఆయన తప్పుకొని జూనియర్లకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.