Argentina star Lionel Messi to miss 2022 FIFA World Cup 2022 Final against France: ఖాతార్‌ వేదికగా ఆదివారం జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 ఫైనల్‌కు ముందు అర్జెంటీనాకు బిగ్‌ షాక్‌ తగిలే అవకాశం ఉంది. అర్జెంటీనా కెప్టెన్‌, ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో ఆడడం ప్రస్తుతం అనుమానంగానే ఉంది. క్రొయేషియాతో జరిగిన సెమీ ఫైనల్లో మ్యాచ్‌లో అయిన గాయం తీవ్రంగా ఉందట. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. మెస్సీ అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. మెస్సీ త్వరగా కోలుకోవాలని అర్జెంటీనా ఫాన్స్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులు కోరుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రొయేషియాతో మంగళవారం జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో 3-0తో అర్జెంటీనా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లియోనెల్ మెస్సీ ఓ గోల్ చేశాడు. అయితే మ్యాచ్‌ జరుగుతుండగానే మైదానంలో మెస్సీ అసౌకర్యంగా కదిలాడు. నొప్పిని భరిస్తూ కూడా అతడు మ్యాచ్ ఆడాడు. మెస్సీ స్నాయువుకు గాయమైనట్లు సమాచారం. గాయం కారణంగా గురువారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌కు అతడు దూరంగా ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. దాంతో ఫ్రాన్స్‌తో జరిగే వరల్డ్‌కప్‌ 2022 ఫైనల్‌ మ్యాచ్‌లో ఆడడం అనుమానంగా మారింది. 


లియోనెల్ మెస్సీ మాత్రమే కాకుండా అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్ పాపు గోమెజ్ కూడా చీలమండ గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఫిఫా వరల్డ్‌కప్‌ 2022ఫైనల్‌ మ్యాచ్‌కు గోమెజ్ అందుబాటుపై కూడా ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది. ఒకవేళ ఈ ఇద్దరు దూరమయితే అర్జెంటీనాకు కష్టాలు తప్పవు. ఇక ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ లియోనెల్ మెస్సీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఫిఫా వరల్డ్‌కప్‌ గెలిచి తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ముగించాలని అతడు భావిస్తున్నాడు. 


'గోల్డెన్ బూట్' అవార్డు రేసులో లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), ఎంబాపే (ఫ్రాన్స్)లు రేసులో ఉన్నారు. ఇద్దరి ఖాతాలో చెరో 10 గోల్స్ ఉన్నాయి. ఫైనల్స్‌లో ఎవరు ఎక్కువ గోల్స్ చేస్తే.. వారినే గోల్డెన్ బూట్ అవార్డు వరించనుంది. 1958లో జరిగిన వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌ ఆటగాడు జస్ట్ ఫాన్‌టెయిన్ 13 గోల్స్ కొట్టాడు. ఇప్పటివరకు ఒక ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ ఇవే. మరి మెస్సీ, ఎంబాపే ఏమైనా మాయ చేస్తారో చూడాలి. 


Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్లు ఇలా ఉన్నాయి!  


Also Read: Donation Tips: పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేయకూడదు.. చేశారో మీ అదృష్టం దురదృష్టంగా మారుతుంది!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.