Lionel Messi Tests Positive For Covid:  స్టార్ ఫుట్​బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ (Lionel Messi) కరోనా బారిన పడ్డారు. మరో ముగ్గురు ఆటగాళ్లకు కూడా కొవిడ్ సోకినట్లు పారిస్ సెయింట్ జర్మన్(పీఎస్​జీ) ఫుట్​బాల్ క్లబ్ పేర్కొంది. జువాన్ బెర్నట్, సెర్జియో రికో, నాథన్ బిటుమజాలాకు కొవిడ్​ సోకింది. నలుగురు ఆటగాళ్లతో పాటు సిబ్బందిలో ఒకరికి కూడా కరోనా పాజిటివ్​గా (Covid-19) తేలిందని పీఎస్​జీ (Paris Saint-Germain Club) వెల్లడించింది. ప్రస్తుతం వీరు ఐసోలేషన్​లో ఉన్నట్లు తెలిపింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సోమవారం ఫ్రెంచ్ కప్ గేమ్ (French Cup match) జరగనుంది. ఈ నేపథ్యంలో...మెస్సీ సోమవారం జరిగే మ్యాచ్ తో పాటు లియోన్‌లో జరిగే పీఎస్​జీ మొదటి లీగ్ 1 మ్యాచ్‌కి కూడా దూరం కానున్నాడు. గత వేసవిలో మెస్సీ.. బార్సిలోనా క్లబ్ నుంచి వైదొలిగాడు. మెస్సీ పీఎస్జీ తరపున 11 లీగ్ మ్యాచ్‌లలో ఒక గోల్ మాత్రమే చేసాడు. అయినప్పటికీ అతను ఛాంపియన్స్ లీగ్‌లో ఐదు సార్లు నెట్‌ని సాధించాడు.


Also Read: Sourav Ganguly: దాదాకు మళ్లీ కరోనా..ఈ సారి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ పాజిటివ్!


గతేడాది రన్నరప్‌గా నిలిచిన మొనాకో సెకండ్ టైర్ గేమ్స్ ఆడనుంది. అయితే మొనాకోకు చెందిన ఏడుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు కంపెనీ తెలిపింది. మరి ఈ మ్యాచ్, టోర్నీ జరుగుతుందో లేక నిలిపివేస్తారో చూడాలి. ఫ్రాన్స్‌లో ఈవారంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య 2లక్షలకు చేరుకుంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook