IND vs NZ 3rd T20 Live Streaming: పొట్టి సిరీస్‌ చివరి పోరుకు రంగం సిద్ధమైంది. సొంతగడ్డపై మరోసారి సిరీస్ గెలుచుకోవాలని భారత్.. కనీసం ఈ సిరీస్‌నైనా చేజిక్కించుకోవాలని కివీస్ అఖరి పోరుకు రెడీ అయ్యాయి. తొలి టీ20లో కివీస్‌.. రెండో టీ20లో భారత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇవాళ నిర్ణయాత్మకమైన మూడు మ్యాచ్ లో రెండు జట్లు పోటీకి దిగతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాప్ ఆర్డర్ రాణించాలి..
సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం న్యూజిలాండ్ కు అంత సులభం కాదు. అయితే గత మ్యాచ్ లో స్వల్ప లక్షాన్ని అపసోపాలు పడుతూ గెలిచిన భారత్.. ఈ మ్యాచ్ లో పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారత్ బ్యాటింగ్ లో విఫలమవుతూ వస్తుంది. సూర్య మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా ఆడటం లేదు. రోహిత్, కోహ్లీలు లేని లోటును యువ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. వన్డేల్లో అదరగొట్టిన గిల్ టీ20ల్లో తేలిపోయాడు. ఇషాన్ కిషన్ ఇంకా గాడిలో పడలేదు. రాహుల్ త్రిపాఠి కూడా వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. హార్దిక్ కూడా తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. కుల్‌దీప్‌ యాదవ్‌, దీపక్ కుడా ఫామ్‌లో ఉండడం భారత్ కు కలిసొచ్చే అంశం. గత రెండు మ్యాచుల్లో విఫలమైన అర్ష్‌దీప్‌ సింగ్‌ లయ పుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. చాహల్ ప్లేస్ లో ఉమ్రాన్ తీసుకునే అవకాశం ఉంది. 


ఎలాగైనా గెలవాలని కివీస్..
సిరీస్ గెలవాలనే పట్టుదలతో న్యూజిలాండ్ ఈ మ్యాచులో బరిలోకి దిగుతుంది. కివీ బ్యాటర్లు రెండో మ్యాచ్ లో విఫలమైనప్పటికీ..కాన్వే, అలెన్, మిచెల్ వంటి ఆటగాళ్లు మంచి ఊపు మీద ఉన్నారు. ఫిలిప్స్ ఫామ్ ను అందుకోవాల్సి ఉంది. కివీస్ బౌలింగ్ విభాగం బాగానే ఉంది. శాంట్నర్‌, సోధి, ఫెర్గూసన్‌ కూడిన న్యూజిలాండ్ బౌలింగ్ దళం బాగా రాణిస్తుంది.


Also Read: SuryaKumar Yadav: ఆ విషయంలో నాదే తప్పు.. వైరల్‌గా మారిన సూర్యకుమార్ యాదవ్‌ కామెంట్స్! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.