IND vs AUS 3rd T20 Tickets: పేటీఎం ఇన్సైడర్ ఆప్‌లో మ్యాచ్ టికెట్స్ అమ్మకాలు.. రాత్రి 7 గంటలకు స్టార్ట్!
Fans Injured at Hyderabad Gymkhana Cricket Stadium for IND vs AUS 3rd T20I Ticket. హైదరాబాద్ నగరంలోని జింఖానా మైదానం వద్ద ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
హైదరాబాద్ నగరంలోని జింఖానా మైదానం వద్ద ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న మూడో టీ20 మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు కొట్టుకుంటున్నారు. ఓవైపు వర్షం పడుతున్నా.. ఫాన్స్ అందరూ టికెట్స్ కోసం ఎగబడ్డారు. దాంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. లోపలికి వెళ్లేందుకు అభిమానులు గేట్లు పగులగొట్టారు. ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి దూసుకెళ్లడంతో.. తొక్కిసలాట జరిగింది. పోలీసులు అభిమానులపై లాఠీచార్జ్ చేశారు.
Latest Updates
సికింద్రాబాద్ జింఖానా మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించిన ఆఫ్‌లైన్ టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయని హెచ్‌సీఏ వెల్లడించింది.
పేటీఎం ఇన్సైడర్ ఆప్ ద్వారా ఈరోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ టికెట్స్ అమ్మకాలు ఆరంభం కానున్నాయి.
ఈరోజు రాత్రి 7 గంటలకు ఆన్ లైన్ లో భారత్, ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని హెచ్‌సీఏ పేర్కొంది.
రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ నగరంలోని తన కార్యాలయంలో హెచ్‌సీఏపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంకు హెచ్‌సీఏ అధ్యక్షుడు మొహ్మద్ అజారుద్దీన్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, స్పోర్ట్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా హాజరయ్యారు.
క్రికెట్ మ్యాచ్ కోసం వచ్చిన అభిమానులను లారిఛార్జ్ పేరుతొ నడ్డి విరిగేలా పోలీసులు.. అందరూ పోయాక కౌంటర్ దగ్గరికి వెళ్లి టికెట్లు కొనుగోలు చేశారు.
హెచ్‌సీఏ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత మొహ్మద్ అజారుద్దీన్ ను క్రికెట్ ఫాన్స్ అమ్మనా బూతులు తిడుతున్నారు.
హెచ్‌సీఏ వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని అదనపు కమిషినర్ డీఎస్ చౌహన్ పరోక్షంగా అన్నారు.
హెచ్‌సీఏ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత మొహ్మద్ అజారుద్దీన్ 10 వేల టికెట్స్ తీసుకున్నట్లు బోగట్టా.
కొన్ని టికెట్స్ మంత్రులు, ఎమ్మెల్యేలు లాంటి ఉన్నతస్థాయి వారికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
నేడు కేవలం 5 వేల టికెట్స్ మాత్రమే అమ్ముడయ్యాయని సమాచారం. మొత్తంగా 25 వేల టికెట్స్ అయిపోయినా.. మిగతా 14 వేల టికెట్స్ ఏమయ్యాయని ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 15న రాత్రి 8 గంటలకు ‘పేటీఎం’లో టిక్కెట్ల అమ్మకాలు మొదలవగా.. కొన్ని క్షణాల్లోనే అయిపోయాయి. ఆరోజు సుమారు 10,000 మాత్రమే అందుబాటులో ఉంచినట్లు సమాచారం.
ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం కెపాసిటీ మొత్తం 55 వేలు. అయితే 39 వేల టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. హెచ్‌సీఏలోని 216 క్లబ్‌లకు తలా 15 చొప్పున 3240 పాసులు వెళతాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ సంస్థల సిబ్బందికి మొత్తం 9000 పాసులుగా వెళతాయి. ఇవన్నీ పోయినా ఇంకా 30000 టికెట్లు అందుబాటులో ఉంటాయి.
లాఠీఛార్జ్ లో దాదాపుగా 20 మంది గాయపడ్డారు. అందులో ఐదుగురు సివిలియన్స్, ఒక కానిస్టేబుల్, ఒక ఫైర్ సిబ్బంది ఉన్నారు.
జింఖానా మైదానం వద్ద జరిగిన తోపులాటలో చాలా మందికి కాళ్లు, చేతులు విరిగినట్టు తెలుస్తోంది. ఎవరూ చనిపోలేదని పోలీసులు స్పష్టం చేశారు.
మూడో టీ20కి ఎన్ని టికెట్లు ఉన్నాయి.. ఎన్ని ఆన్ లైన్ లో పెట్టారు.. ఎంతమందికి కాంప్లిమెంటరీ పాసులు ఇచ్చారన్న పూర్తి వివరాలతో రావాలని హెచ్‌సీఏకు ఆదేశించారు.
జింఖానా గ్రౌండ్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. టికెట్ల కేటాయింపుపై సమీక్షకు రావాలని HCA మేనేజ్ మెంట్‌ను ఆదేశించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
జింఖానా మైదానంలో గాయపడిన మహిళ చనిపోలేదు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది: అదనపు డీసీపీ నార్త్ జోన్
టికెట్స్ కోసం వెళ్లిన వారిలో 20 మందికి పైగా ఫాన్స్ స్పృహ తప్పి పడిపోయారు. ఇందులో మహిళా ఫాన్స్ కూడా ఉన్నారు. ఓ అమ్మాయి పరిస్థితి విషయంగా ఉంది.
టికెట్స్ కోసం అంచనాలకు మించి అభిమానులు రావడంతో పరిస్థితిని నియంత్రించడం పోలీసులతో సాధ్యం కాలేదు. మెయిన్ గేట్ వైపు నుంచి ఫాన్స్ తోసుకుని రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో లాఠీఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది.
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం అంచనాలకు మించి అభిమానులు వచ్చారు. వేలాదిగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొంతమంది అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు.