India vs England Live Updates: వరుణుడి అడ్డంకి.. నిలిచిన మ్యాచ్‌

Thu, 27 Jun 2024-10:12 pm,

India vs England Live Score Updates: టీ20 వరల్డ్ కప్‌ రెండో సెమీ ఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు నేడు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొడుతుంది. India vs Australia లైవ్ స్కోరు అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

India vs England T20 World Cup Semi Final 2 Live Score Updates: టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. రెండో జట్టు ఏదో నేడు తేలిపోనుంది. భారత్, ఇంగ్లాండ్ జట్లు సెమీ ఫైనల్-2లో తలపడనున్నాయి. గయానాలోని గయానా నేషనల్ స్టేడియంలో గురువారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమి ఎరుగని జట్టుగా సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. పడుతూ లేస్తూ సెమీస్‌కు చేరింది. 2022 సెమీస్‌లో భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది ఇంగ్లీష్ జట్టు. మరోసారి ఇప్పుడు అదే ఫీట్‌ను రిపీట్ చేయాలని ఇంగ్లాండ్ భావిస్తుండగా.. ఆ సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. భారత్ Vs ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ లైవ్ స్కోరు అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

Latest Updates

  • India vs England Live Updates: వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పేశారు.

  • India vs England Live Updates: ఎనిమిదో ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ కళ్లు చెదిరే సిక్సర్ బాదాడు. స్కోరు: 65/2 (8).

  • India vs England Live Updates: ఏడు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది.

  • India vs England Live Updates: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రిషభ్ పంత్ (4)ను సామ్ కర్రాన్ ఔట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లోకి వచ్చాడు. స్కోరు: 46/2 (6).

  • India vs England Live Updates: ఐదో ఓవర్‌లో రోహిత్ శర్మ రెండు బౌండరీలు బాదడంతో 11 పరుగులు వచ్చాయి. స్కోరు బోర్డు: 40/1 (5).

  • India vs England Live Updates: నాలుగు ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (16), పంత్ (2) క్రీజ్‌లో ఉన్నారు.

  • India vs England Live Updates: మూడో ఓవర్‌లో టీమిండియాకు బిగ్‌ షాక్‌ తగిలింది. సిక్సర్ బాది టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన విరాట్ కోహ్లీ (9)ని టోప్లీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. రిషబ్ పంత్ క్రీజ్‌లోకి వచ్చాడు. స్కోరు: 21/1 (3)

  • India vs England Live Updates: రెండో ఓవర్‌లో ఐదు పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ చివరి బంతిని రోహిత్ శర్మ బౌండరీకి తరలించాడు.
     

  • India vs England Live Updates: మొదటి ఓవర్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ హిట్టింగ్ మొదలుపెట్టాడు. రెండో బంతినే బౌండరీకి తరలించాడు. మూడు బంతులు ఎదుర్కొన్న కోహ్లీ ఒక పరుగు చేశాడు. మొదటి ఓవర్‌లో మొత్తం ఆరు పరుగులు వచ్చాయి.
     

  • India vs England Live Updates: తుది జట్లు ఇలా:
    భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
    ఇంగ్లాండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్, వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ

  • India vs England Live Updates: టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ ఆరంభించనుంది.

  • India vs England Live Updates: గౌండ్ సిబ్బంది ఔట్ ఫీల్డ్‌ను సిద్ధం చేశారు. ప్లేయర్లు గ్రౌండ్‌లో వార్మప్ చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్‌ను పరిశీలిస్తున్నాడు. మరికాసేపట్లో టాస్ వేసే అవకాశం ఉంది.

  • India vs England Live Updates: వర్షం నిలిచిపోయింది. అయితే ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండడంతో టాస్ ఆలస్యమవుతోంది. 

  • India vs England Live Updates: ప్రస్తుతం స్టేడియంలో ఇంకా వర్షం కురుస్తోంది. పిచ్‌ను కవర్లు కప్పివేశారు. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావచ్చు. 

  • India vs England Dream11 Team Prediction and Playing 11: భారత్ VS ఇంగ్లాండ్ హెడ్ టు హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

  • India vs England Live Updates: భారత్, ఇంగ్లాండ్ సెమీ ఫైనల్‌ మ్యాచ్ టాస్ సమయంలో వర్షం పడే అవకాశం 66 శాతం ఉంది. నివేదికల ప్రకారం 10 ఓవర్ల ఆట కట్ ఆఫ్ సమయం 1:45 AM  వరకు ఉంటుంది.

  • India vs England Live Updates: భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్ డే లేదు. దీంతో మ్యాచ్ రద్దయితే ఎవరు ఫైనల్‌కు వెళతారు..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

  • India vs England Live Updates: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వర్షం రాకపోతే 7.30 గంటలకు టాస్ వేస్తారు.

  • India vs England Weather Updates: భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్‌కు వర్షం ముప్పుపొంచి ఉంది. ప్రస్తుతం స్టేడియం వద్ద వర్షం కురుస్తోంది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link