IND vs ENG Semi-Final: ఓపెనర్ల ఊచకోత.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం! ఫైనల్లో పాక్‌తో ఢీ
India vs England Cricket Score T20 World Cup 2022 Updates. టీ20 ప్రపంచకప్ 2022 రెండో సెమీ ఫైనల్లో భారత్‌తో జరిగిన మ్యాచులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలో ఛేదించింది.
IND vs ENG Semi-Final T20 World Cup 202: టీ20 ప్రపంచకప్ 2022 రెండో సెమీ ఫైనల్లో భారత్‌తో జరిగిన మ్యాచులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలో ఛేదించింది.
Latest Updates
టీ20 ప్రపంచకప్ 2022 రెండో సెమీ ఫైనల్లో భారత్‌తో జరిగిన మ్యాచులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలో ఛేదించింది. ఇంగ్లీష్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (86), జోస్ బట్లర్ (80) భారత బౌలర్లను ఊచకోత కోశారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఈ ఇద్దరు 10కి పైగా రన్ రేట్ మెయిటైన్ చేస్తూ పరుగులు చేశారు. దాంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. అంతకుముందు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 రన్స్ చేసింది. ఇక ఫైనల్లో పాక్‌ను ఇంగ్లండ్ ఢీ కొట్టనుంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.
15వ ఓవర్ ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ కోల్పోకుండా 56/0 రన్స్ చేసింది. అలెక్స్ హేల్స్ (81), జోస్ బట్లర్ (71) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 13 రన్స్ అవసరం.
14 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ స్కోర్ 154/0. క్రీజ్‌లో అలెక్స్ హేల్స్ (80), జోస్ బట్లర్ (70) ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 15 రన్స్ మాత్రమే కొట్టాలి.
12వ ఓవర్ ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ కోల్పోకుండా 123 రన్స్ చేసింది. అలెక్స్ హేల్స్ (77), జోస్ బట్లర్ (42) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 46 రన్స్ అవసరం.
11 ఓవర్లు: హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 10 రన్స్ వచ్చాయి. ఇంగ్లండ్ స్కోర్ 108/0. క్రీజ్‌లో అలెక్స్ హేల్స్ (66), జోస్ బట్లర్ (38) ఉన్నారు.
10 ఓవర్లు పూర్తి:
10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ స్కోర్ 98/0. క్రీజ్‌లో అలెక్స్ హేల్స్ (57), జోస్ బట్లర్ (37) ఉన్నారు. భారత్ 10 ఓవర్లలలో 71 రన్స్ మాత్రమే చేయాలి.9 ఓవర్లు పూర్తి: ఇంగ్లండ్ స్కోర్ 91/0. అలెక్స్ హేల్స్ (51), జోస్ బట్లర్ (36) క్రీజ్‌లో (0) ఉన్నారు. ఈ ఓవర్లో హార్దిక్ పాండ్యా 7 రన్స్ ఇచ్చాడు.
హేల్స్ ఫిఫ్టీ:
ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అక్షర్ పటేల్ వేసిన 8వ ఓవర్ చివరి బంతికి సఙ్గలే తీసి ఫిఫ్టీ బాదాడు.8వ ఓవర్ ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ కోల్పోకుండా 84 రన్స్ చేసింది. అలెక్స్ హేల్స్ (50), జోస్ బట్లర్ (30) క్రీజ్‌లో ఉన్నారు.
7 ఓవర్లు: ఆర్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 12 రన్స్ వచ్చాయి. ఇంగ్లండ్ స్కోర్ 75/0. క్రీజ్‌లో అలెక్స్ హేల్స్ (42), జోస్ బట్లర్ (29) ఉన్నారు.
పవర్ ప్లే పూర్తి:
పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ స్కోర్ 63/0. క్రీజ్‌లో అలెక్స్ హేల్స్ (33), జోస్ బట్లర్ (28) ఉన్నారు. భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 62 రన్స్ మాత్రమే చేసింది.హేల్స్ సిక్స్:
5 ఓవర్లు: మొహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్‌లో అలెక్స్ హేల్స్ సిక్స్, ఫోర్ బాదేశాడు. ఇంగ్లండ్ స్కోర్ 52/0. క్రీజ్‌లో హేల్స్ (26), బట్లర్ (24) ఉన్నారు.
భారత బౌలర్లకు ఓపెనర్లు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. నాలుగు ఓవర్లలోనే 41 పరుగులు చేశారు. స్కోరు 4 ఓవర్లు 41/0
ఇంగ్లాండ్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో ఒక సిక్స్‌తోపాటు మొత్తం 12 రన్స్ చేశారు. స్కోరు 3 ఓవర్లు: 33/0
ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ జోరు కొనసాగుతోంది. రెండో ఓవర్లోనూ ఒక ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో మొత్తం 8 పరుగులు వచ్చాయి.
169 పరుగుల లక్ష్యంతో ఇంగ్లాండ్ బరిలోకి దిగింది. మొదటి ఓవర్లో జోస్ బట్లర్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో మూడు బాదడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి.
20 ఓవర్లలో భారత్ స్కోర్ 168/6:
భారత్ ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి భారత్ 168 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ (50; 40 బంతుల్లో 4x4, 1x6), హార్దిక్ పాండ్యా (63; 33 బంతుల్లో 4x4, 5x6) ఉన్నారు. 18 ఓవర్లకు భారత్ స్కోర్ 136 ఉండగా.. పాండ్యా మెరుపులతో టీమిండియా 168 రన్స్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ మూడు వికెట్స్ పడగొట్టాడు.19 ఓవర్లు: సామ్ కరన్ వేసిన ఈ ఓవర్లో 20 రన్స్ వచ్చాయి. భారత్ స్కోర్ 56/4. హార్దిక్ పాండ్యా 2 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు.
18 ఓవర్లు పూర్తి: భారత్ స్కోర్ 136/4. క్రీజ్‌లో హార్దిక్ పాండ్యా (37), రిషబ్ పంత్ (0) ఉన్నారు.
కోహ్లీ ఔట్:
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిన తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. 40 బంతుల్లో 50 రన్స్ చేసి ఔట్ అయ్యాడు.17వ ఓవర్ ముగిసేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 121 రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (48) హార్దిక్ పాండ్యా (24) ఉన్నారు.
15 ఓవర్లు పూర్తి:
భారత్ ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు పూర్తయ్యాయి. మూడు వికెట్ల నష్టానికి భారత్ 100 రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (43) హార్దిక్ పాండ్యా (9) ఉన్నారు.14 ఓవర్లు పూర్తి: భారత్ స్కోర్ 90/3. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (38), హార్దిక్ పాండ్యా (4) ఉన్నారు. క్రిస్ వోక్స్ వేసిన ఈ ఓవర్లో 10 రన్స్ వచ్చాయి.
13 ఓవర్లు: లియామ్ లివింగ్‌స్టోన్ వేసిన ఈ ఓవర్లో 3 రన్స్ వచ్చాయి. భారత్ స్కోర్ 80/3. విరాట్ కోహ్లీ (31), హార్దిక్ పాండ్యా (2) క్రీజ్‌లో ఉన్నారు.
సూర్యకుమార్ ఔట్:
ఫామ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (14) ఔట్ అయ్యాడు. ఆదిల్ రషీద్ వేసిన 12వ ఓవర్ రెండో బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 77/3. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (29), హార్దిక్ పాండ్యా (1) ఉన్నారు.11వ ఓవర్ ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 74 రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (27) సూర్యకుమార్ యాదవ్ (14) ఉన్నారు.
10 ఓవర్లు పూర్తి:
భారత్ ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు పూర్తయ్యాయి. భారత్ రెండు వికెట్ల నష్టానికి 62 రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (26) సూర్యకుమార్ యాదవ్ (3) ఉన్నారు.రోహిత్ ఔట్:
టీమిండియాకు మరో షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (27) ఔట్ అయ్యాడు. క్రిస్ జోర్డాన్ వేసిన 9వ ఓవర్ ఐదవ బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. భారత్ స్కోర్ 57/2.8 ఓవర్లు పూర్తి: భారత్ స్కోర్ 51/1. రోహిత్ శర్మ (23), విరాట్ కోహ్లీ (22) క్రీజ్‌లో ఉన్నారు.
7 ఓవర్లు: లియామ్ లివింగ్‌స్టోన్ వేసిన ఈ ఓవర్లో 8 రన్స్ వచ్చాయి. భారత్ స్కోర్ 446/1. క్రీజ్‌లో రోహిత్ శర్మ (21), విరాట్ కోహ్లీ (19) ఉన్నారు.
పవర్ ప్లే పూర్తి:
భారత్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే పూర్తయింది. భారత్ ఒక వికెట్ నష్టానికి 38 రన్స్ చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (20), విరాట్ కోహ్లీ (12) ఉన్నారు.రోహిత్ ఫోర్లు:
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు బౌండరీలు బాదాడు. సామ్ కరన్ వేసిన 5వ ఓవర్ 2, 3 బంతులకు బుల్లెట్ షాట్లు ఆడాడు. భారత్ స్కోర్ 31/1.4 ఓవర్లు: క్రిస్ వోక్స్ వేసిన ఈ ఓవర్లో 10 రన్స్ వచ్చాయి. భారత్ స్కోర్ 21/1. క్రీజ్‌లో రోహిత్ శర్మ (5), విరాట్ కోహ్లీ (10) ఉన్నారు.
కోహ్లీ కమాల్:
విరాట్ కోహ్లీ భారీ సిక్స్ బాదాడు. క్రిస్ వోక్స్ వేసిన 4 ఓవర్ మొదటి బంతికి 73 మీటర్ల సిక్స్ బాదాడు.మూడో ఓవర్ ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 11 రన్స్ చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (4), విరాట్ కోహ్లీ (2) ఉన్నారు. సామ్ కరన్ వేసిన ఈ ఓవర్లో 1 రన్ మాత్రమే ఇచ్చాడు.
2 ఓవర్లు పూర్తి: భారత్ స్కోర్ 10/1. రోహిత్ శర్మ (4), విరాట్ కోహ్లీ (1) క్రీజ్‌లో ఉన్నారు. క్రిస్ వోక్స్ వేసిన ఈ ఓవర్లో 4 రన్స్ వచ్చాయి.
రాహుల్ ఔట్:
ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియాకు షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (5) ఔట్ అయ్యాడు. క్రిస్ వోక్స్ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు.మొదటి ఓవర్ ముగిసేసరికి భారత్ వికెట్ కోల్పోకుండా 6 రన్స్ చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (1), కేఎల్ రాహుల్ (5) ఉన్నారు. బెన్ స్టోక్స్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి.
భారత్ ఇన్నింగ్స్ ఆరంభం అయింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ క్రీజ్‌లోకి వచ్చారు.
తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.
ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్.
అడిలైడ్‌లో మరికొద్దిసేపట్లో ఆరంభం కానున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన చివరి 5 టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియా నాలుగు సార్లు విజయం సాధించగా.. ఇంగ్లీష్ జట్టు ఒక్కసారే గెలిచింది.
రికార్డ్స్:
అంతర్జాతీయ టీ20ల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు ఇప్పటివరకు 22 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో భారత్ 12 సార్లు గెలవగా.. ఇంగ్లండ్ 10 సార్లు విజయం సాధించింది.విజేతగా భారత్:
భారత్ vs ఇంగ్లండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముంపు పొంచి ఉందని స్థానిక వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఒక వేళ వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ రద్దైతే.. రిజ్వర్ డేలో మ్యాచ్ జరుగుతుంది. వర్షం కారణంగా మ్యాచ్ రిజ్వర్ డేలో కూడా సాధ్యపడకపోతే.. సూపర్ 12లో టాపర్‌గా ఉన్న భారత్ విజేతగా నిలుస్తుంది.