IND vs SA Updates: మిల్లర్, మార్క్రమ్ హాఫ్ సెంచరీలు.. టీమిండియాపై దక్షిణాఫ్రికా విజయం!

Sun, 30 Oct 2022-8:22 pm,

ICC T20 World Cup 2022 India vs South Africa Match updates. టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికాజట్ల మధ్య మ్యాచ్ ఆరంభం అయింది.

ICC T20 World Cup 2022 India vs South Africa Cricket Match updates: టీ20 ప్రపంచకప్‌ 2022లో వరుస విజయాలతో జోష్‌లో ఉన్న టీమిండియా దూకుడుకు దక్షిణాఫ్రికా బ్రేక్‌ వేసింది. భారత్ నిర్ధేశించిన 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ప్రొటీస్ మరో రెండు బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. 

Latest Updates

  • టీ20 ప్రపంచకప్‌ 2022లో వరుస విజయాలతో జోష్‌లో ఉన్న టీమిండియా దూకుడుకు దక్షిణాఫ్రికా బ్రేక్‌ వేసింది. భారత్ నిర్ధేశించిన 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ప్రొటీస్ మరో రెండు బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. మార్‌క్రమ్ (52), మిల్లర్ (59) హాఫ్ సెంచరీలతో దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించారు. భారత్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ రెండు వికెట్స్ పడగొట్టాడు. ఈ విజయంతో ప్రొటీస్ 5 పాయింట్లతో గ్రూప్ 2 నుంచి అగ్ర స్థానంలో నిలిచింది. భారత్ 4 పాయింట్లతో రెండో సస్థానంలో ఉంది. 
     

  • 19 ఓవర్లు: దక్షిణాఫ్రికా స్కోరు 128/5. ప్రొటీస్ విజయానికి ఇంకా 6 బంతుల్లో 6 రన్స్ కావాలి. 
     

  • 18 ఓవర్లు పూర్తి:
    18 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా స్కోర్ 122/5. క్రీజ్‌లో డేవిడ్ మిల్లర్ (46) ఉన్నాడు. ప్రొటీస్ విజయానికి ఇంకా 12 రన్స్ మాత్రమే కావాలి. 
     

  • 17 ఓవర్లు: దక్షిణాఫ్రికా స్కోరు 109/4. అర్షదీప్ సింగ్ వేసిన ఈ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. క్రీజ్‌లో డేవిడ్ మిల్లర్ (34), ట్రిస్టన్ స్టబ్స్ (6) ఉన్నారు. ప్రొటీస్ విజయానికి ఇంకా 25 రన్స్ కావాలి. 
     

  • కీలక వికెట్‌:
    దక్షిణాఫ్రికా 100 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది. హార్దిక్ పాండ్యా వేసిన 16వ ఓవర్‌ నాలుగో బంతికి ఐడెన్ మార్క్రమ్ (52) ఔట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా స్కోరు 102/4. 
     

  • కీలక వికెట్‌:
    దక్షిణాఫ్రికా 100 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది. హార్దిక్ పాండ్యా వేసిన 16వ ఓవర్‌ నాలుగో బంతికి ఐడెన్ మార్క్రమ్ (52) ఔట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా స్కోరు 102/4. 
     

  • డీకేకు గాయం:
    వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ గాయపడ్డాడు. నొప్పితో మైదానం బయటికి వెళ్లగా.. రిషబ్ పంత్ వచ్చాడు. 

  • 15 ఓవర్లు పూర్తి:
    15 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా స్కోర్ 95/3. క్రీజ్‌లో ఐడెన్ మార్క్రమ్ (50), డేవిడ్ మిల్లర్ (28) ఉన్నారు. ప్రొటీస్ విజయానికి ఇంకా 39 రన్స్ మాత్రమే కావాలి. 

  • 14వ ఓవర్ ముగిసేసరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్స్ కోల్పోయి 85 రన్స్ చేసింది. క్రీజ్‌లో ఐడెన్ మార్క్రమ్ (43), డేవిడ్ మిల్లర్ (26) ఉన్నారు. ఆర్ అశ్విన్ ఈ ఓవర్లో 17 రన్స్ ఇచ్చాడు. 

  • రనౌట్ మిస్:
    13 ఓవర్లు: దక్షిణాఫ్రికా స్కోరు 68/3. మొహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్‌లో 3 పరుగులు వచ్చాయి. క్రీజ్‌లో ఐడెన్ మార్క్రమ్ (36), డేవిడ్ మిల్లర్ (16) ఉన్నారు. రోహిత్ శర్మ కీలక రనౌట్ మిస్ చేశాడు. 
     

  • కోహ్లీ క్యాచ్ మిస్:
    ఆర్ అశ్విన్ వేసిన 12వ ఓవర్లో ఐడెన్ మార్క్రమ్ ఇచ్చిన సునాయాస క్యాచును విరాట్ కోహ్లీ నేలపాలు చేసాడు. దక్షిణాఫ్రికా స్కోర్ 65/3. 

  • జోరు పెంచిన దక్షిణాఫ్రికా:
    డ్రింక్స్ బ్రేక్ అనంతరం దక్షిణాఫ్రికా బ్యాటర్లు జోరు పెంచారు. హార్దిక్ పాండ్యా వేసిన 11వ ఓవర్లో 16 రన్స్ వచ్చాయి. మార్క్రమ్, మిల్లర్ చెరో బౌండరీ బాదారు. 

  • 10 ఓవర్లు పూర్తి:
    10 ఓవర్లు పవర్ ముగిసేసరికి దక్షిణాఫ్రికా స్కోర్ 40/3. క్రీజ్‌లో ఐడెన్ మార్క్రమ్ (23), డేవిడ్ మిల్లర్ (5) ఉన్నారు. ప్రొటీస్ విజయానికి ఇంకా 94 రన్స్ కావాలి. 

  • 9వ ఓవర్ పూర్తి: దక్షిణాఫ్రికా స్కోర్ 35/3. క్రీజ్‌లో ఐడెన్ మార్క్రమ్ (20), డేవిడ్ మిల్లర్ (3) ఉన్నారు. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి.  
     

  • రివ్యూ కోల్పోయిన భారత్:
    8వ ఓవర్ ముగిసేసరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్స్ కోల్పోయి 33 రన్స్ చేసింది. క్రీజ్‌లో ఐడెన్ మార్క్రమ్ (19), డేవిడ్ మిల్లర్ (2) ఉన్నారు. మొహ్మద్ షమీ ఈ ఓవర్లో ఓకే పరుగు మాత్రమే వచ్చింది.  

  • 7 ఓవర్లు: ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు32/3. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. క్రీజ్‌లో ఐడెన్ మార్క్రమ్ (19), డేవిడ్ మిల్లర్ (1) ఉన్నారు. 
     

  • మూడో వికెట్‌:
    దక్షిణాఫ్రికా 24 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. మొహ్మద్ షమీ వేసిన ఆరో ఓవర్‌ నాలుగో బంతికి టెంబా బావుమా (10) క్యాచ్ ఔట్ అయ్యాడు. డీకే అద్భుత క్యాచ్ పట్టాడు. పవర్ ప్లే ముగిసేసరికి దక్షిణాఫ్రికా స్కోర్ 24-3. 

  • బావుమా సిక్స్:
    ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి దక్షిణాఫ్రికా స్కోర్ 21/2. క్రీజ్‌లో టెంబా బావుమా (9), ఐడెన్ మార్క్రమ్ (10) ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో బావుమా సిక్స్ బాదాడు. 

  • ఆచితూచి ఆడుతున్న దక్షిణాఫ్రికా:
    రెండు వికెట్స్ కోల్పోవడంతో దక్షిణాఫ్రికా ఆచితూచి ఆడుతోంది. 5 ఓవర్లకు స్కోర్ 13-2. 
     

  • నాలుగో ఓవర్ ముగిసేసరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్స్ కోల్పోయి 9 రన్స్ చేసింది. క్రీజ్‌లో టెంబా బావుమా (3), ఐడెన్ మార్క్రమ్ (5) ఉన్నారు. ఈ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ 2 రన్స్ ఇచ్చాడు. 
     

  • 3వ ఓవర్ పూర్తి: దక్షిణాఫ్రికా స్కోర్ 7-2. రెండో ఓవర్లో అర్ష్‌దీప్‌ సింగ్‌ 2 వికెట్స్ పడగొట్టాడు. క్రీజ్‌లో టెంబా బావుమా (2), ఐడెన్ మార్క్రమ్ (4) ఉన్నారు.
     

  • దక్షిణాఫ్రికా మూడు పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. అర్ష్‌దీప్‌ సింగ్‌ వేసిన రెండో ఓవర్‌ మూడో బంతికే రుస్సో ఎల్బీ వెనుదిరిగాడు.
     

  • డికాక్ ఔట్:
    టీమిండియాకు అర్షదీప్ సింగ్ బ్రేక్ ఇచ్చాడు. రెండో ఓవర్ మొదటి బంతికి క్వింటన్ డికాక్ (1)ను ఔట్ చేశాడు. 
     

  • మొదటి ఓవర్ ముగిసేసరికి దక్షిణాఫ్రికా వికెట్ కోల్పోకుండా 3 రన్స్ చేసింది. క్రీజ్‌లో క్వింటన్ డికాక్ (1), టెంబా బావుమా (2) ఉన్నారు. ఈ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ 3 రన్స్ ఇచ్చాడు. 
     

  • మొదలైన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్:
    ఓపెనర్లు క్వింటన్ డికాక్, టెంబా బావుమా క్రీజ్‌లోకి వచ్చారు. భువనేశ్వర్ కుమార్ మొదటి ఓవర్ వేస్తున్నాడు. 

  • ముగిసిన భారత్ ఇన్నింగ్స్:
    భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 రన్స్ చేసి.. దక్షిణాఫ్రికా ముందు 134 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సూర్యకుమార్ యాదవ్ (68; 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లీ (12) తప్ప మరెవరూ రెండంకెల స్కోర్ అందుకోలేదు. ప్రొటీస్ బౌలర్ లుంగి ఎంగిడి 4 వికెట్లతో చెలరేగాడు. ఇక బౌలర్లపై భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.  

  • భారత్ ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు పూర్తయ్యాయి. ఈ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ (68) ఔట్ అయ్యాడు.  టీమిండియా స్కోర్ 127/8. క్రీజ్‌లో భువనేశ్వర్ కుమార్ (1), మొహ్మద్ షమీ (0) ఉన్నారు. 
     

  • 18వ ఓవర్ ముగిసేసరికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 124 రన్స్ చేసింది. క్రీజ్‌లో సూర్యకుమార్ యాదవ్ (66), ఆర్ అశ్విన్  (7) ఉన్నారు. 
     

  • 17 ఓవర్లు: ప్రస్తుతం టీమిండియా స్కోరు115/6. కేశవ్ మహరాజ్‌ వేసిన ఈ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. క్రీజ్‌లో సూర్యకుమార్ యాదవ్ (61), ఆర్ అశ్విన్ (4) ఉన్నారు. 
     

  • డీకే ఔట్:
    వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ నిరాశపరిచాడు. పార్నెల్ వేసిన 16వ ఓవర్ మొదటి బంతికి భారీ షాట్ ఆడి క్యాచ్ ఔట్ అయ్యాడు. భారత్ స్కోర్ 101/6. 

  • సూర్య భారీ సిక్స్:
    సూర్యకుమార్ 92 మీటర్ల సిక్స్ బాదాడు. ఎంగిడి వేసిన 15వ ఓవర్లోనే ఫోర్ బాది హాఫ్ సెంచరీ బాదాడు. భారత్ స్కోర్ 101/5.

  • సూర్య సిక్స్:
    భారత్ ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు పూర్తయ్యాయి. భారత్ స్కోర్ 84/5. కేశవ్ మహరాజ్‌ వేసిన నాలుగో బంతికి సూర్య సిక్స్ బాదాడు. క్రీజ్‌లో సూర్యకుమార్ యాదవ్ (37), దినేష్ కార్తీక్ (3) ఉన్నారు. 

  • 12 ఓవర్లు: ప్రస్తుతం టీమిండియా స్కోరు 73/5. రబడా వేసిన ఈ ఓవర్‌లో ఆరు పరుగులు వచ్చాయి. క్రీజ్‌లో సూర్యకుమార్ యాదవ్ (27), దినేష్ కార్తీక్ (2) ఉన్నారు. 
     

  • 11వ ఓవర్ ముగిసేసరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 67 రన్స్ చేసింది. క్రీజ్‌లో సూర్యకుమార్ యాదవ్ (23), దినేష్ కార్తీక్ (3) ఉన్నారు. 
     

  • 10 ఓవర్లు పూర్తి:
    భారత్ ఇన్నింగ్స్‌లో పది ఓవర్లు పూర్తయ్యాయి. భారత్ స్కోర్ 60/5. క్రీజ్‌లో సూర్యకుమార్ యాదవ్ (17), దినేష్ కార్తీక్ (1) ఉన్నారు. 

  • ఎంగిడి నిప్పులు: దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి నిప్పులు చెరిగాడు. 2.4 ఓవర్లలో 4 వికెట్స్ పడగొట్టాడు. ఎంగిడి వేసిన 9వ ఓవర్ మూడో బంతికి హార్దిక్ ఔట్ అయ్యాడు. స్కోర్ 49/5. 
     

  • ఎనిమిదవ ఓవర్ ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 47 రన్స్ చేసింది. క్రీజ్‌లో సూర్యకుమార్ యాదవ్ (6), హార్దిక్ పాండ్యా (1) ఉన్నారు. 
     

  • దీపక్ హుడా ఔట్:
    టీమిండియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దీపక్ హుడా ఔట్ అయ్యాడు. నోర్జ్ వేసిన 8వ ఓవర్ మూడో బంతికి దీపక్ క్యాచ్ ఔట్ అయ్యాడు. 

  • 7వ ఓవర్ పూర్తి: భారత్ స్కోర్ 6/2. భారత్‌ స్కోరు 41/3. క్రీజ్‌లో సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా ఉన్నారు.
     

  • కోహ్లీ ఔట్:
    టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (12) ఔట్ అయ్యాడు. లుంగి ఎంగిడి వేసిన 7వ ఓవర్ ఐదో బంతికి విరాట్ క్యాచ్ ఔట్ అయ్యాడు. 
     

  • ముగిసిన పవర్ ప్లే:
    పవర్ ప్లే ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 33 రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్ (1) ఉన్నారు. 
     

  • ఒకే ఓవర్లో భారత్ రెండు వికెట్స్:
    ఒకే ఓవర్లో భారత్ రెండు వికెట్స్ కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (15), కేఎల్ రాహుల్ (9) ఔట్ అయ్యారు. లుంగి ఎంగిడి వేసిన 5వ ఓవర్లో ఓపెనర్లు ఔట్ అయ్యారు. 

  • 4 ఓవర్లు: భారత్‌ స్కోరు 21/0. రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (8) క్రీజ్‌లో ఉన్నారు. కగిసో రబడ ఈ ఓవర్‌లో 7 రన్స్ ఇచ్చాడు. 
     

  • రాహుల్ సిక్స్:
    మూడో ఓవర్ ముగిసేసరికి భారత్ వికెట్ కోల్పోకుండా 14 రన్స్ చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (7), కేఎల్ రాహుల్ (7) ఉన్నారు. ఈ ఓవర్‌లో వేన్ పార్నెల్ 8 రన్స్ ఇచ్చాడు. రెండో బంతికి రాహుల్ సిక్స్ బాదాడు. 
     

  • రాహుల్‌కు గాయం:
    టీమిండియా ఓపెనర్కేఎల్ రాహుల్‌కు గాయం అయింది. వేన్ పార్నెల్ వేసిన మూడో ఓవర్ ఐదవ బంతి రాహుల్‌ గార్డ్ కు బలంగా తాకింది. దాంతో అతడు నొప్పితో విలవిలలాడిపోయాడు. 

  • రోహిత్ సిక్స్:
    రెండో ఓవర్ పూర్తి: భారత్ స్కోర్ 6/0. రోహిత్ శర్మ (6), కేఎల్ రాహుల్ (0) క్రీజ్‌లో ఉన్నారు. కగిసో రబడ రెండో ఓవర్‌లో 6 రన్స్ ఇచ్చాడు. 
     

  • మొదటి ఓవర్ ముగిసేసరికి భారత్ ఒక్క పరుగు కూడా చేయలేదు. రోహిత్ శర్మ (0), కేఎల్ రాహుల్ (0) క్రీజ్‌లో ఉన్నారు. వేన్ పార్నెల్ మొదటి ఓవర్‌ను మెయిడిన్ గా వేశాడు. 

  • భారత్ ఇన్నింగ్స్ ఆరంభం అయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ క్రీజ్‌లోకి వచ్చారు. దక్షిణాఫ్రికా బౌలర్ వేన్ పార్నెల్ మొదటి ఓవర్‌ను వేస్తున్నాడు.  

  • ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్‌కు అసలు సవాల్‌ ఎదురు కానుంది. 140-150 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించే నోర్జ్, రబడలను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఈ ఇద్దరిని తట్టుకుని టాపార్డర్‌ నిలబడితే పరుగులు చేసే అవకాశం ఉంది. 
     

  • తుది జట్లు:
    భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్. 
    దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్ (కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రిలీ రోసోవ్, ఐడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జ్. 
     

  • దక్షిణాఫ్రికాపై ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడా ఆడనున్నాడు. మరోవైపు ప్రొటీస్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. షమ్సీ స్థానంలో ఎంగిడి ఆడుతున్నాడు. 
     

  • దక్షిణాఫ్రికాతో మరోకొద్ది సేపట్లో ఆరంభం కానున్న మ్యాచులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 
     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link