IND vs PAK Live Updates: కలిసొచ్చిన నో బాల్.. ఉత్కంఠ పోరులో పాకిస్తాన్‌పై భారత్ విజయం!

Sun, 23 Oct 2022-5:31 pm,

IND vs PAK T20 World Cup 2022 Live Updates. టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఆరంభం అయింది.

IND vs PAK T20 World Cup 2022 Live Updates: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఆరంభం అయింది. మెల్‌బోర్న్‌ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్ చేతిలో భారత్‌ ఓడిపోయింది. దీంతో గత ప్రపంచకప్‌ ఓటమికి పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా చూస్తోంది. 

Latest Updates

  • టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్ 12లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో భారత్ అద్భుత విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ చివరి బంతికి ఛేదించింది. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా.. పాక్ సిన్నర్ మహ్మద్ నవాజ్16 రన్స్ ఇచ్చాడు. భారత్ విజయంలో కింగ్ 'విరాట్' కోహ్లీ (82), హార్దిక్ పాండ్యా (40) కీలక పాత్ర పోషించారు. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్, మహ్మద్ నవాజ్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు. 
     

  • 19 ఓవర్లకు భారత్ స్కోరు 144/4. విజయానికి ఇంకా 6 బంతుల్లో 16 రన్స్ అవసరం. 
     

  • 18 ఓవర్లకు భారత్ స్కోరు 129/4. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (61), హార్దిక్ పాండ్యా (38) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 2 ఓవర్లలో 31 రన్స్ అవసరం. 
     

  • పరుగులు చేసేందుకు భారత బ్యాటర్లు కష్టపడుతున్నారు. 17 ఓవర్లు ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 112 రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (46), హార్దిక్ పాండ్యా (37) ఉన్నారు. విజయానికి ఇంకా 48 రన్స్ కావాలి. 
     

  • పాక్‌ బౌలింగ్‌ కట్టుదిట్టంగా సాగుతోంది. 16వ ఓవర్లో కేవలం ఆరు పరుగులు మాత్రమే వచ్చాయి. భారత్ విజయానికి ఇంకా 24 బంతుల్లో 54 రన్స్ కావాలి. 
     

  • 15 ఓవర్లకు భారత్ స్కోరు 100/4. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (42), హార్దిక్ పాండ్యా (32) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 5 ఓవర్లలో 60 రన్స్ అవసరం. 
     

  • 14 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ నాలుగు వికెట్లను కోల్పోయి 90 పరుగులు చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (34), హార్దిక్ పాండ్యా (30) ఉన్నారు.
     

  • 13 ఓవర్లకు భారత్ స్కోరు 83/4. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (28), హార్దిక్ పాండ్యా (29) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 77 రన్స్ అవసరం. 
     

  • మహ్మద్ నవాజ్ వేసిన 12వ ఓవర్లో 20 రన్స్ వచ్చాయి. హార్దిక్ పాండ్యా రెండు సిక్సులు బాధగా.. విరాట్ కోహ్లీ ఒక సిక్సర్ బాదాడు. భారత్ స్కోర్ 74/4. 
     

  • 11 ఓవర్లకు భారత్ స్కోరు 54/4. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (15), హార్దిక్ పాండ్యా (19) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 100 రన్స్ అవసరం. 
     

  • పాక్‌ బౌలింగ్‌ కట్టుదిట్టంగా ఉంది. దీంతో పరుగులు చేసేందుకు భారత బ్యాటర్లు కష్టపడుతున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 45 రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (12), హార్దిక్ పాండ్యా (7) ఉన్నారు.
     

  • 9 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోర్ 41/4. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (11), హార్దిక్ పాండ్యా (4) ఉన్నారు. ఈ ఓవర్లో షాదాబ్ ఖాన్ 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 
     

  • 8 ఓవర్లకు భారత్ స్కోరు 38-4. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (9), హార్దిక్ పాండ్యా (3) ఉన్నారు.
     

  • 160 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది. 31 పరుగులకే 4 వికెట్స్ కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడింది. అక్షర్ పటేల్ రనౌట్ అయ్యాడు. అంతకుముందు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచారు. 
     

  • 6 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోర్ 31-3. కోహ్లీ, అక్షర్ క్రీజులో ఉన్నారు. 
     

  • ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ సహా సూర్యకుమార్ యాదవ్ కూడా పెవిలియన్ చేరాడు. 
     

  • 5 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోర్ 22-2. ఐదో ఓవర్ వేసిన నసీమ్ షా 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 
     

  • 4 ఓవర్లు పూర్తి. హరీస్ రవూఫ్ వేసిన ఈ ఓవర్‌లో రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. భారత్ స్కోర్17-2. 
     

  • ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. కేఎల్ రాహుల్ విఫలమవగా.. రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరాడు. 
     

  • 3 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోర్ 10-1. మూడో ఓవర్ వేసిన షాహీన్ అఫ్రిది 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 
     

  • భారత్ తొలి వికెట్ కోల్పోయింది. నసీం షా వేసిన రెండో ఓవర్‌లో కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు. 1.5 ఓవర్లలో భారత్ 7 పరుగులు చేసింది.

  • టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లుగా రోహిత్, కేఎల్ రాహుల్ బరిలో దిగారు. ఆఫ్రిది తొలి ఓవర్ వేశాడు. తొలి ఓవర్‌లో భారత్ 5 పరుగులు చేసింది.

  • పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్స్ కోల్పోయి 159 రన్స్ చేసింది. షాన్ మసూద్ (52), ఇఫ్తికార్ అహ్మద్ (51) హాఫ్ సెంచరీలు బాదారు. భారత్ ముందు 160 పరుగుల మోస్తరు లక్ష్యం ఉంది.వీరిద్దరి తర్వాత షాహీన్ అఫ్రిది (16) రెండంకెల స్కోర్ అందుకున్నాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలో మూడు వికెట్స్ పడగొట్టారు. 
     

  • 19 ఓవర్లు పూర్తయ్యేసరికి పాకిస్తాన్ స్కోర్ 149-7. షాహీన్ అఫ్రిది బౌండరీలతో రెచ్చిపోయాడు. షాన్ మసూద్ (51), షాహీన్ అఫ్రిది (16) క్రీజులో ఉన్నారు. 
     

  • 18 ఓవర్లు పూర్తి. ఈ ఓవర్‌లో మొహ్మద్ షమీ 10 పరుగులు ఇచ్చాడు. పాక్ స్కోర్135-7. 
     

  • 17 ఓవర్లు పూర్తయ్యేసరికి పాకిస్తాన్ స్కోర్ 125/7. షాన్ మసూద్ (40), షాహీన్ అఫ్రిది (4) క్రీజులో ఉన్నారు. 
     

  • పాకిస్తాన్ మరో  వికెట్ కోల్పోయింది. అసిఫ్ అలీ (2) క్యాచ్ ఔట్ అయ్యాడు. 

  • పాకిస్తాన్ ఏడో వికెట్ కోల్పోయింది. మొహ్మద్ నవాజ్‌ (9) క్యాచ్ ఔట్ అయ్యాడు. 16 ఓవర్లకు పాక్‌ స్కోరు 116-6కి చేరింది. 
     

  • 15 ఓవర్లకు పాక్‌ స్కోరు 106/5కి చేరింది. క్రీజ్‌లో మొహ్మద్ నవాజ్‌, షాన్ మసూద్ ఉన్నారు.
     

  • పాకిస్థాన్‌ ఐదో వికెట్‌ను కోల్పోయింది. హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో డేంజరస్ బ్యాటర్ హైదర్‌ అలీ (2) భారీ షాట్‌కు యత్నించి సూర్యకుమార్‌ కుమార్ చేతికే చిక్కాడు. 14 ఓవర్లు ముగిసేసరికి పాక్‌ స్కోరు 98/5.
     

  • హాఫ్ సెంచరీ బాదిన పాక్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ ఔట్ అయ్యాడు. మొహ్మద్ షమీ వేసిన 13వ ఓవర్ రెండో బంతికి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. 
     

  • పాక్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ చెలరేగాడు. అక్షర్ పటేల్ వేసిన 12వ ఓవర్లో మూడు భారీ సిక్సులు బాదాడు. ఈ ఓవర్లో మొత్తంగా 21 రన్స్ వచ్చాయి. 
     

  • భారీ సిక్సర్:
    పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో మొదటి సిక్సర్ నమోదైంది. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో ఇఫ్తికార్ అహ్మద్ భారీ సిక్సర్ బాదాడు. 11 పూర్తయ్యేసరికి పాకిస్తాన్ స్కోర్ 70-2. షాన్ మసూద్ (30), ఇఫ్తికార్ అహ్మద్ (30) క్రీజులో ఉన్నారు. 
     

  • సగం ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 60 రన్స్ చేసింది. షాన్ మసూద్ (29), ఇఫ్తికార్ అహ్మద్ (21) పరుగులతో క్రీజులో ఉన్నారు. 10వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా 10 రన్స్ ఇచ్చాడు. 
     

  • 9 ఓవర్లు పూర్తి. ఈ ఓవర్‌లో రవిచంద్రన్ అశ్విన్ 6 పరుగులు ఇచ్చాడు. పాక్ స్కోర్ 50/2. 
     

  • ఎనిమిదో ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 44 రన్స్ చేసింది. షాన్ మసూద్ (25), ఇఫ్తికార్ అహ్మద్ (11) క్రీజులో ఉన్నారు. 
     

  • రవిచంద్రన్ అశ్విన్ కీలక క్యాచ్ మిస్ చేశాడు. షాన్ మసూద్ ఇచ్చిన క్యాచును డైవ్ చేస్తూ పట్టినా.. బాల్ గ్రౌండ్‌ను తాకి చేతుల్లో పడింది. 

  • ఏడు ఓవర్లు పూర్తయ్యేసరికి పాకిస్తాన్ స్కోర్ 41-2. షాన్ మసూద్ (24), ఇఫ్తికార్ అహ్మద్ (11) క్రీజులో ఉన్నారు. 
     

  • ఇఫ్తికార్ అహ్మద్ తృటిలో రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఏడో ఓవర్ మూడో బంతికి రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. 

  • పవర్ ప్లే ముగిసేసరికి పాకిస్తాన్ రెండు వికెట్స్ కోల్పోయి 32 రన్స్ చేసింది. షాన్ మసూద్ (19), ఇఫ్తికార్ అహ్మద్ (7) క్రీజులో ఉన్నారు. మొహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 8 రన్స్ వచ్చాయి. 

  • 5 ఓవర్లు: భారత బౌలింగ్‌ కట్టుదిట్టంగా సాగుతోంది. ఈ ఓవర్‌లో భువీ 9 పరుగులు ఇచ్చాడు. ఐదు ఓవర్లకు పాక్ స్కోర్ 24/2. 
     

  • పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. పాక్ డేంజరస్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ ఔట్ అయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన నాలుగో ఓవర్ చివరి బంతికి రిజ్వాన్‌ పెవిలియన్ చేరాడు. రిజ్వాన్‌ 12 బంతులు ఆడి కేవలం నాలుగు రన్స్ మాత్రమే చేయాడు. 
     

  • మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి పాకిస్తాన్ స్కోర్ 10/1 . మహ్మద్ రిజ్వాన్‌ (4), షాన్ మసూద్ (4) క్రీజులో ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ 4 రన్స్ ఇచ్చాడు. 
     

  • రెండో ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ ఒక వికెట్ నష్టానికి 6 రన్స్ చేసింది. మహ్మద్ రిజ్వాన్‌ (4), షాన్ మసూద్ (1) క్రీజులో ఉన్నారు. 
     

  • పాకిస్తాన్ మొదటి వికెట్ కోల్పోయింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్ మొదటి బంతికి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. పాక్ కెప్టెన్ రివ్యూ తీసుకున్నా.. లాభం లేకుండా పోయింది. 

  • మొదటి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్.. పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌ను బెంబేలెత్తించాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. తొలి ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. 
     

  • పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌కు గాయం అయింది. భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ రెండో బంతి.. రిజ్వాన్‌ వెలికి బలంగా తాకింది. 
     

  • ఎంసీజీ మైదానంలో ఇప్పటివరకు 15 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు నాలుగుసార్లు.. ఛేజింగ్‌ చేసిన జట్లు తొమ్మిది సార్లు గెలిచాయి. ఒక మ్యాచ్ మ్యాచ్‌ రద్దయింది. 
     

  • టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్‌ ఆరు సార్లు తలపడ్డాయి. ఇందులో ఐదు సార్లు భారత్‌ గెలవగా.. ఒకసారి పాకిస్తాన్‌ను విజయం సాధించింది.
     

  • భారత్ ఏడుగురు బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్‌లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతోందని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ చెప్పాడు. 
     

  • వికెట్ కీపర్‌గా దినేశ్‌ కార్తిక్‌ తుది జట్టులో ఉండడంతో రిషబ్ పంత్‌కు నిరాశ తప్పలేదు. ఇటీవల ఫినిషర్ రోల్ పోషిస్తున్న డీకేపై భారత్ భారీ నమ్మకం పెట్టుకుంది. 
     

  • తుది జట్లు:
    భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్. 
    పాకిస్తాన్‌: బాబర్ ఆజామ్ (కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌ కీపర్‌), షాన్ మసూద్, హైదర్ అలీ, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఆసిఫ్ అలీ, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, నసీమ్ షా. 
     

  • టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దాంతో పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.  
     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link