SRH Vs RR Live Score: ముగిసిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..?

Fri, 24 May 2024-9:23 pm,

Sunrisers Hyderabad vs Rajasthan Royals Live Score Updates: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఐపీఎల్ 2024 ఫైనల్‌లో అడుగుపెట్టేందుకు మరో ఛాన్స్. నేడు రాజస్థాన్‌ను ఓడిస్తే ఫైనల్‌లో ఎంట్రీ ఇస్తుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్.. ఫైనల్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.

Sunrisers Hyderabad vs Rajasthan Royals Live Score Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. క్వాలిఫైయర్-2 పోరుకు రెండు జట్లు అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యాయి. తొలి క్వాలిఫైయర్‌లో కోల్‌కోతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైన సన్‌రైజర్స్.. నేడు రాజస్థాన్‌ను ఓడించి ఫైనల్స్‌లో అడుగుపెట్టాలని చూస్తోంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మట్టికరిపించిన రాజస్థాన్‌.. అదే జోరులో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించాలని రెడీ అవుతోంది. హైదరాబాద్ బ్యాటింగ్‌కు.. రాజస్థాన్‌ బౌలింగ్‌కు మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి బిగ్‌ఫైట్ జరగనుంది. సన్‌రైజర్స్, రాజస్థాన్ జట్ల మ్యాచ్‌కు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి. 
 

Latest Updates

  • SRH Vs RR Live Score Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో రాజస్థాన్ బరిలోకి దిగనుంది.

  • SRH Vs RR Live Score Updates: 19 ఓవర్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి. స్కోరు: 169/7 (19).

  • SRH Vs RR Live Score Updates: ఎస్‌ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్ గేర్ మార్చారు. క్లాసెన్ 33 బంతుల్లో 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్లాసెన్‌కు తోడు షాబాజ్ అహ్మద్ (17) క్రీజ్‌లో ఉన్నాడు. స్కోరు బోర్డు: 163/6 (18).

  • Sunrisers Hyderabad vs Rajasthan Royals Live Score Updates: 17 ఓవర్‌లో సన్‌రైజర్స్ 14 పరుగులు పిండుకుంది. స్కోరు: 150-6.

  • Sunrisers Hyderabad vs Rajasthan Royals Live Score Updates: 16 ఓవర్‌ను అవేశ్‌ఖాన్ చక్కగా వేశాడు. ఈ ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. క్లాసెన్ (37), షాబాజ్ అహ్మద్ (5) క్రీజ్‌లో ఉన్నారు. స్కోరు: 136/6 (16).

  • Sunrisers Hyderabad vs Rajasthan Royals Live Score Updates: 15 ఓవర్‌లో క్లాసెన్ ఓ సిక్సర్ బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 12 రన్స్ వచ్చాయి. స్కోరు బోర్డు: 132/6 (15).

  • Sunrisers Hyderabad vs Rajasthan Royals Live Score Updates: సన్‌రైజర్స్‌ను సందీప్ శర్మ భారీ దెబ్బ తీశాడు. 14 ఓవర్‌లో చివరి రెండు బంతులకు రెండు వికెట్లు తీశాడు. నితీష్‌ రెడ్డి (5), అబ్దుల్ సమాద్ (0)ను పెవిలియన్ బాటపట్టించాడు. స్కోరు: 120-6 (14)

  • SRH Vs RR Live Score Updates: చాహల్ వేసిన 13 ఓవర్‌లో క్లాసెన్‌ ఓ సిక్సర్ బాదాడు. ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. స్కోరు 116-4.

  • SRH Vs RR Live Score Updates: 12 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. ఈ ఓవర్‌లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి.

  • SRH Vs RR Live Score Updates: 11 ఓవర్‌లో చాహల్ కేవలం ౩ పరుగులు మాత్రమే ఇచ్చాడు. క్లాసెన్ (17), నితీష్ రెడ్డి (0) క్రీజ్‌లో ఉన్నారు. స్కోరు: 102/4 (11) 

  • SRH Vs RR Live Score Updates: పదో ఓవర్లలో సందీప్ శర్మ భారీ షాక్ ఇచ్చాడు. క్రీజ్‌లో కుదుకున్న ట్రావిస్ హెడ్ (34)ను ఔట్ చేశాడు. దీంతో సన్ రైజర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. స్కోరు: 99-4

  • SRH Vs RR Live Score Updates: తొమ్మిదో ఓవర్‌ను అశ్విన్ చక్కగా బౌలింగ్ చేశాడు. కేవలం 4 పరుగుల మాత్రమే ఇచ్చాడు.  స్కోరు 96-3.

  • SRH Vs RR Live Score Updates: చాహల్ వేసిన 8వ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. స్కోరు 92-3.

  • SRH Vs RR Live Score Updates: ఏడో ఓవర్లో హెడ్ సిక్స్, ఫోర్ బాదడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి. స్కోరు: 81-3

  • దూకుడు పెంచిన హెడ్‌
    - పవర్‌ ప్లే ఆఖరి ఓవర్‌లో 4, 4
    - 68/3కు చేరిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
    - స్కోర్‌పరంగా ఒకే కానీ.. వికెట్లు కోల్పోయి కొంత కష్టాల్లో కమిన్స్‌ సేన

     

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    హైదరాబాద్‌ 3 వికెట్లు డౌన్‌

    - బ్యాటింగ్‌కు దిగిన మార్‌క్రమ్‌ ఒక్క పరుగుకే ఔట్‌
    - మూడో వికెట్‌ తీసిన ట్రెంట్‌ బౌల్ట్‌
    - 5 ఓవర్‌లో రెండు కీలక వికెట్లు కోల్పోయిన హైదరాబాద్‌.

  • 2వ ఓవర్‌లో త్రిపాఠి దూకుడుతో ఆట

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్‌ త్రిపాఠి దూకుడుతో ఆటను ప్రారంభించాడు.
    - ఒక ఫోర్లు కొట్టిన త్రిపాఠి
    - 22 పరుగులకు చేరిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.

    - ఇంకా ఫామ్ లోకి రాని ట్రావెస్ హెడ్

  • IPL 2024 Eliminator 2: హైదరాబాద్‌కు భారీ షాక్‌.

    తొలి ఓవర్‌ 6వ బంతికి ఫోర్‌ కొడుతూ క్యాచ్‌ ఇచ్చిన అభిషేక్‌ శర్మ.
    - అంతకుముందు 6, 4, 2 తో రెచ్చిపోయిన అభిషేక్‌. తొలి ఓవర్‌లో 13 పరుగులు.
    - గోల్డెన్‌ డకౌట్‌ తప్పించుకున్న ట్రావిస్‌ హెడ్‌.

     

  • SRH Vs RR Live Score Updates:

    సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్లు: ఉమ్రాన్ మాలిక్, సన్వీర్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, షాబాజ్ అహ్మద్
    రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: షిమ్రాన్ హెట్‌మేయర్, నాంద్రే బర్గర్, శుభమ్ దూబే, డోనోవన్ ఫెరీరా, కుల్దీప్ సేన్.

  • SRH Vs RR Live Score Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఈ మ్యాచ్‌లో మార్క్‌రమ్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఉనద్కత్‌ కూడా ప్లేయింగ్‌11 లో చోటు దక్కించుకుంది.

  • SRH Vs RR Playing 11: సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర), అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి.నటరాజన్

    రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్, కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

  • SRH Vs RR Toss Updates: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఆరంభించనుంది.
     

  • SRH Vs RR Live Score Updates: మరికాసేట్లో అంటే 7 గంటలకు టాస్ వేయనున్నారు. ఇప్పటికే రెండు జట్ల ఆటగాళ్లు స్టేడియానికి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు.

  • SRH Vs RR Live Score Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌ పోరు ఇంట్రెస్టింగ్‌గా సాగనుంది. పవర్ హిట్టర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ.. రాజస్థాన్ స్పిన్ ద్వయం యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్‌ల మధ్య బిగ్‌ ఫైట్ జరగనుంది.

  • SRH Vs RR Playing 11: తుది జట్లు ఇలా.. (అంచనా)

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్/విజయకాంత్ వియస్కాంత్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే

    రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్/కేశవ్ మహారాజ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్.

  • SRH Vs RR Dream11 Team Tips: సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లలో డ్రీమ్11 టీమ్‌ను ఎలా ఎంచుకోవాలి..? హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
     

  • SRH Vs RR Live Score Updates: చెన్నై పిచ్ స్లోగా ఉంటుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link