Ravindra Jadeja Retirement: రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన రవీంద్ర జడేజా!!
రవీంద్ర జడేజా బుధవారం తన ట్విటర్ ఖాతాలో టెస్ట్ జెర్సీ ధరించిన ఫోటోను పోస్ట్ చేశాడు. `లాంగ్ వే టూ గో (ఇంకా చాలా ఆడాల్సి ఉంది)` అని ఫొటోకు కాప్షన్ ఇచ్చాడు.
Ravindra Jadeja reacts about his Retirement rumours: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. వన్డేలు, టీ20 ఫార్మాట్‌లలో ఎక్కువ కాలం ఆడేందుకు టెస్టులకు వీడ్కోలు (Test Retirement పలకాలని జడేజా నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై జడేజా స్పందించకపోవడంతో అది నిజమేమో అని అందరూ అనుకున్నారు. తాజాగా ఈ రూమర్లపై జడ్డు స్పందించాడు. అవన్నీ గాలివార్తలే అని ఓ ట్వీట్ చేశాడు. రిటైర్మెంట్కు చాలా సమయం ఉందని పేర్కొన్నాడు.
రవీంద్ర జడేజా (Ravindra Jadeja) బుధవారం తన ట్విటర్ ఖాతాలో టెస్ట్ జెర్సీ ధరించిన ఫోటోను పోస్ట్ చేశాడు. 'లాంగ్ వే టూ గో (ఇంకా చాలా ఆడాల్సి ఉంది)' అని ఫొటోకు కాప్షన్ ఇచ్చాడు. దాంతో టెస్టు క్రికెట్ (Test Cricket)ను ఇప్పుడప్పుడే వదిలేయను అని జడ్డు చెప్పకనే చెప్పాడు. మొత్తానికి జడేజా ఒక ట్వీట్‌తో తనపై వచ్చే రూమర్లకు చెక్ పెట్టాడు. రవీంద్ర జడేజా భారత్ తరఫున 57 టెస్టులు, 168 వన్డేలు, 55 టీ20లు ఆడాడు. టెస్టులో 2195 రన్స్, 232 వికెట్లు.. వన్డేల్లో 2411 పరుగులు, 188 వికెట్స్.. టీ20ల్లో 256 రన్స్, 46 వికెట్లు పడగొట్టాడు. మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు జడేజా తిరుగులేని ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్నాడు.
Also Read: Casting Couch: సౌత్ మూవీ మేకర్స్ నడుము, ఎదభాగాల కొలతలు అడిగారు.. శర్వానంద్ హీరోయిన్ సంచనల వ్యాఖ్యలు
గత నెలలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా రవీంద్ర జడేజా (Ravindra Jadeja) గాయపడిన సంగతి తెలిసిందే. కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఆడిన జడ్డు.. ముంచేతి గాయం కారణంగా రెండో టెస్ట్ ఆడలేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో బీసీసీఐ (BCCI) సెలెక్టర్లు అతడిని త్వరలో దక్షిణాఫ్రికాతో ఆరంభం అయ్యే టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. స్టార్ ఆల్‌రౌండర్ ముంచేతి గాయానికి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. జడ్డు కోలుకునేందుకు దాదాపుగా 4-6 నెలల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి