IPL 2022: పంజాబ్ కింగ్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం
IPL 2022: పంజాబ్ కింగ్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చేసిన తక్కువ స్కోరును చేజింగ్ చేయనివ్వకుండా పంజాబ్ ను కట్టడి చేశారు లక్నో బౌలర్లు. దీంతో రాహుల్ సేన.. మరో విజయాన్ని అందుకుంది.
IPL 2022: పంజాబ్ కింగ్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చేసిన తక్కువ స్కోరును చేజింగ్ చేయనివ్వకుండా పంజాబ్ ను కట్టడి చేశారు లక్నో బౌలర్లు. దీంతో రాహుల్ సేన.. మరో విజయాన్ని అందుకుంది.
పుణె వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి.. 153 పరుగులు చేసింది. లక్నో ఓపెనర్లలో రాహుల్ కేవలం ఆరు పరుగులతో నిరాశపర్చగా.. డికాక్ మాత్రం 46 పరుగులు చేశాడు. రాహుల్ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా కూడా 28 బంతులు ఆడి 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఏ ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా 20 పరుగులు కూడా చేయలేదు. పంజాబ్ బౌలర్లలో రబాడ నాలుగు వికెట్లతో చెలరేగాడు. కీలకమైన రాహుల్, కృణాల్ పాండ్యా, ఆయుష్ బదోనీ, చమీరా వికెట్లు తీసి లక్నోను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. రాహుల్ చాహర్ రెండు, సందీప్ శర్మ ఒక వికెట్ తీశారు.
అటు లక్నో నిర్దేశించిన టార్గెట్ ను చేధించేందుకు పంజాబ్ నుంచి మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ ఓపెనర్లుగా వచ్చారు. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శిఖర్ ధావన్ ను.. రవి బిష్ణోయ్.. బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జానీ బెయిర్ స్ట్రో 32 పరుగులు, బానుక రాజపక్సే 9 పరుగులకే ఔట్ అయ్యాడు. లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, రిషి ధావన్ ఇలా వచ్చిన బ్యాట్స్ మెన్ ను లక్నో బౌలర్లు భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ మూడు, చమీరా రెండు, కృణాల్ పాండ్యా రెండు వికెట్లు తీశారు. నాలుగు ఓవర్లు వేసి కేవలం 11 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసిన కృణాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
తాజా విజయంతో పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ మూడో స్థానానికి చేరింది. లక్నో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో 6 విజయాలు సాధించింది. అటు పంజాబ్ ఆడిన 9 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే నమోదుచేసింది. దీంతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది.
Also Read: Tamil Nadu to aid Srilanka: శ్రీలంకకు సాయం చేస్తాం.. కేంద్రం అనుమతి కోరిన తమిళనాడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.