KL Rahul Banned: లక్నో సూపర్ జెయింట్స్ సారధికి 24 లక్షల పెనాల్టీ.. మ్యాచ్‌పై నిషేధం కూడా
KL Rahul Banned: లక్నో సూపర్ జెయింట్స్ సారధి కేఎల్ రాహుల్‌ను బీసీసీఐ బ్యాన్ చేయనుందా..ఇప్పటికే పెనాల్టీ చెల్లించాల్సిన రాహుల్ ఇక మ్యాచ్‌లకు దూరం కానున్నాడా..అసలేం జరిగింది..
KL Rahul Banned: లక్నో సూపర్ జెయింట్స్ సారధి కేఎల్ రాహుల్‌ను బీసీసీఐ బ్యాన్ చేయనుందా..ఇప్పటికే పెనాల్టీ చెల్లించాల్సిన రాహుల్ ఇక మ్యాచ్‌లకు దూరం కానున్నాడా..అసలేం జరిగింది..
ఐపీఎల్ 2022లో నిబంధనలు చాలా మారాయి. స్లో ఓవర్ రేట్ అయితే మూల్యం చెల్లించుకోవల్సిన పరిస్థితి. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇప్పటికే 24 లక్షల రూపాలు పెనాల్టీ చెల్లించాల్సి ఉంది. ముంబై ఇండియన్స్‌పై ఆడిన మిగిలిన సభ్యులు..6 లక్షల రూపాయలు లేదా 25 శాతం మ్యాచ్ ఫీజు..ఏది తక్కువైతే అది చెల్లించాలి. ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించిన ఆనందం కెప్టెన్ రాహుల్‌కు ఎంతో సేపు నిలవలేదు., ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వరుసగా ఈ సీజన్‌లో రెండవసారి ఉల్లంఘించినందుకు శిక్ష అనుభవించకతప్పడం లేదు.
ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓవర్ రేట్ అఫెన్స్ రెండవసారి. ఫలితంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ 24 లక్షల పెనాల్టీ, మిగిలిన సభ్యులు 6 లక్షలు లేదా 25 శాతం మ్యాచ్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టుని లక్నో సూపర్ జెయింట్స్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఓడించింది. ఏప్రిల్ 24లో ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు పెనాల్టీ విధించామని ఐపీఎల్ ఓ ప్రకటన విడుదల చేసింది. స్లో ఓవర్ రేట్ విషయంలో ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెండవసారి తప్పదమిది. అందుకే ఈ పెనాల్టీ విధిస్తున్నామని స్పష్టం చేసింది.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా 24 లక్షల రూపాయలు పెనాల్టీ విధించారు. ఒకవేళ మరోసారి అంటే మూడవసారి లక్నో సూపర్ జెయింట్స్ స్లో ఓవర్ రేట్ చేస్తే..ఈసారి 30 లక్షల పెనాల్టీతో పాటు ఒక మ్యాచ్‌పై నిషేధం కూడా ఉంటుందని ఐపీఎల్ నిబంధనలు చెబుతున్నాయి. మూడుసార్లు స్లో ఓవర్ రేట్‌కు కారణమైతే..బౌలింగ్ టీమ్ కెప్టెన్‌కు ప్రతి మ్యాచ్ నుంచి 30 లక్షలు పెనాల్టీతో పాటు తదుపరి జరిగే లీగ్ మ్యాచ్‌పై నిషేధముంటుంది.
Also read: LSG vs MI: రాహుల్ క్లాసిక్ సెంచరీ.. లక్నో ఘన విజయం! ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఔట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.