Ranji Trophy 2021-22: దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ అదరగొట్టింది. ఈఏడాది రంజీ ట్రోఫీని ముద్దాడింది. ముంబై జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో తొలిసారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబైను 269 పరుగులకు ఆలౌట్ చేసి..108 పరుగుల టార్గెట్‌ను సులువుగా అధిగమించింది. చంద్రకాంత్‌ పండిట్‌కు కోచ్‌గా ఇది ఆరో నేషనల్‌ టైటిల్ కావడం విశేషం.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచి ముంబై జట్టు బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ 134 పరుగులతో అలరించాడు. ఇటు మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. ఓపెనర్ యశ్ దూబే 133, శుభమ్ శర్మ 116, రజిత్ పాటిదార్ 122 పరుగులు చేశారు. ముగ్గురు ఆటగాళ్ల సెంచరీలు..శరన్ష్‌ జన్ 57 పరుగులు చేయడంతో మధ్యప్రదేశ్‌ 536 పరుగుల భారీ స్కోర్‌ నెలకొల్పింది.


సెకండ్ ఇన్నింగ్స్‌లో ముంబై జట్టు టాప్‌ ఆర్డర్ కుప్పకూలింది. పేలవ ప్రదర్శనతో 269 పరుగులకు చాప చుట్టేసింది. 108 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ కేవలం నాలుగు వికెట్లను కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. దీంతో రంజీ ట్రోఫి ముద్దాడాలన్న చిరకాల కోరిక తీరింది. మ్యాచ్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా శుభమ్ శర్మ నిలిచాడు. ఈసీజన్‌లో వెయ్యి పరుగులకు పైగా చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌ సొంతం చేసుకున్నాడు.



మధ్యప్రదేశ్‌ జట్టు ఛాంపియన్‌గా నిలవడంతో కోచ్ రవి చంద్రకాంత్ భావోద్వేగానికి గురైయ్యాడు. కన్నీటి పర్యంతమయ్యాడు. ఇటు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ ఆనందం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులకు విషెస్‌ చెప్పారు.



Also read: Bandi Sanjay: ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి..తెలంగాణ ప్రజలకు బండి సంజయ్‌ పిలుపు..!


Also read:England vs New Zealand: ఇంగ్లండ్‌ టీమ్‌లో కరోనా కలకలం..భారత్‌తో టెస్ట్ మ్యాచ్‌ జరిగేనా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి