Dream 11 Winner: డ్రీమ్ 11తో జాక్ పాట్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన గిరిజనుడు..
Dream 11 Winner: మధ్యప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. డ్రీమ్ 11లో బెట్టింగ్ వేసి కోటి రూపాయలు గెలుచుకున్నాడు.
Singrauli Dream 11 Winner: డ్రీమ్ 11లో బెట్టింగ్ వేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు మధ్యప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు. సింగ్రౌలి జిల్లాలోని గిరిజన పేద కుటుంబానికి చెందిన రామేశ్వర్ సింగ్ (24) సోమవారం భారత్-ఆస్ట్రేలియా టీ20 వార్మప్ మ్యాచ్ కోసం యాప్‌లో టీమ్‌ని సెట్ చేసి.. ఈ మొత్తం గెలుచుకున్నాడు. దీని కోసం అతడు కేవలం రూ.49లే పెట్టుబడి పెట్టాడు.
రామేశ్వర్‌సింగ్ నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించాడు. ఉండేందుకు మంచి ఇల్లు కూడా లేదు. రామేశ్వర్ కుటుంబాన్ని పోషించేందుకు ఓ పాఠశాలలో గెస్ట్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. చాలా రోజులుగా డ్రీమ్ 11 (Dream 11) యాప్‌లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నాడు. ఎప్పటి లాగే సోమవారం భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం బెట్టింగ్ వేయగా అదృష్టం వరించి కోటి రూపాయలు గెలుచుకున్నారు. దీంతో విషయం తెలిసిన రామేశ్వర్ కుటుంబసభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు. గ్రామస్తులు ఆయనకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రామేశ్వర్ సింగ్ భారత్, ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ కోసం 9 జట్లను సెట్ చేశాడు. మ్యాచ్ పూర్తయ్యేసరికి.. రామేశ్వర్ జాక్ పాట్ కొట్టాడు. ఏకంగా రూ.49 పెట్టుబడితో కోటి రూపాయలు ఎగరేసుకుపోయాడు. తాను డ్రీమ్ 11లో రెండు సంవత్సరాలుగా బెట్టింగ్ చేస్తున్నానని.. ఎన్ని సార్లు ఓటమి ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని..ఏదో ఒక రోజు లక్షాధికారిని అవుతాననే బెట్టింగ్ చేసేవాడినని రామేశ్వర్ అన్నాడు. చివరకు అతడికి అదృష్టం కలిసి వచ్చి ఏకంగా కోటీశ్వరుడే అయ్యాడు.
గతంలో...
గతంలోనూ చాలా మంది డ్రీమ్ 11లో బెట్టింగ్ వేసి కోట్లు గెలుచుకున్నారు. రీసెంట్ గా యూపీలోని హరిపుర్ కు చెందిన హషీమ్ 2 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. అదేవిధంగా జమ్మూకాశ్మీర్ కు చెందిన వసీం రాజా అనే యువకుడు డ్రీమ్ 11లో పందెం వేసి రూ.2 కోట్ల రూపాయలు సొంతం చేసుకున్నాడు. దీంతో కుటుంబంలో, గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది.
Also Read: Kedarnath Helicopter Crash: కేదార్‌నాథ్ లో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి ఆరుగురు దుర్మరణం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook