Major Dhyan Chand National Sports Day 2022: భారత దిగ్గజ హాకీ ఆటగాడు మేజర్ 'ధ్యాన్ చంద్' జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1928 ఆమ్‌స్టర్‌డామ్, 1932 లాస్ ఏంజిలెస్, 1936 బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్‌లో భారత్‌కు బంగారు పతకాలు అందించిన ఘనత ధ్యాన్‌ చంద్‌‌దే. ధ్యాన్‌ చంద్ నేతృత్వంలో భారత పురుషుల హాకీ జట్టు మూడు సార్లు ఒలింపిక్స్ పతకాలు గెలిచింది. భారత్‌కు చారిత్రాత్మక విజయాలు అందించడంతో పాటు భారత్‌ పేరు ప్రపంచ పటంలో మార్మోగి పోవడంతో ధ్యాన్ చంద్ కీలకపాత్ర పోషించారు. దీంతో ప్రతి ఏడాది ధ్యాన్‌ చంద్ పుట్టినరోజైన ఆగస్ట్ 29న భారత జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు ధ్యాన్ చంద్ 117వ జయంతి. ఈ ప్రత్యేకమైన రోజున క్రీడల ఆధారిత కొన్ని ఉత్తమ బాలీవుడ్ సినిమాలను మనం వీక్షించవచ్చు. ఆ సినిమాల నుంచి మనం ఆత్మవిశ్వాసం పొంపొందించుకోవడమే కాకుండా ప్రేరణ పొందవచ్చు. చక్ దే ఇండియా, లగాన్, 83, బాగ్ మిల్కా బాగ్, ఎంఎస్ ధోనీ వంటి క్రీడల ఆధారిత సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఈ సినిమాలు ఎప్పుడు చూసినా అందరిలోనూ స్ఫూర్తి నింపుతాయి. 


చక్ దే ఇండియా:
భారత మహిళల హాకీ జట్టు ప్రపంచ కప్‌ను గెలుచుకున్న చిత్రం చక్ దే ఇండియా. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కోచ్ కబీర్ ఖాన్‌గా నటించారు. ఈ సినిమాలో విద్యా మాల్వాడే, శిల్పా శుక్లా, సాగరిక ఘాట్గే, చిత్రాషి రావత్ నటించారు. 2007 షిమిత్ అమీన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారతీయ చలనచిత్ర రంగంలో అత్యుత్తమ క్రీడా చిత్రాలలో ఒకటిగా నిలిచింది.


లగాన్:
అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన 'లగాన్' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  2001లో స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో అమిర్ ఖాన్ హీరోగా నటించారు. వ్యవసాయ పన్నును వదిలించుకోవడానికి బ్రిటిష్ వారితో పోరాడటానికి గ్రామస్తులు క్రికెట్ మ్యాచ్‌ ఆడతారు. భారత జట్టుకు భువన్ కెప్టెన్‌గా భువన్ (అమీర్ ఖాన్) వ్యవహరిస్తాడు. గ్రామస్తుల పోరాటం అందరిని ఆకట్టుకుంటుంది. 


83:
1983లో భారత్ తొలి వన్డే ప్రపంచప్‌ను ఎలా గెలుపొందింది అనే అంశంతో 83 రూపొందించబడింది. రణవీర్ సింగ్ భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రను పోషించగా.. తాహిర్ రాజ్ భాసిన్, సాకిబ్ సలీమ్, హార్డీ సంధు, అమీ విర్క్, జీవాలు.. 1983లో లార్డ్స్‌లో ప్రపంచకప్‌ను గెలుపొందిన దిగ్గజ క్రికెటర్ల పాత్రను పోషించారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కపిల్ దేవ్ భార్య రోమీ భాటియా పాత్రలో కనిపించారు. 2021లో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అయింది. 


భాగ్ మిల్కా భాగ్‌:
దివంగత అథ్లెట్ మిల్కా సింగ్ జీవితం ఆధారంగా 'భాగ్ మిల్కా భాగ్‌' సినిమా వచ్చింది. ఈ సినిమాకు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు. 2013లో వచ్చిన ఈ సినిమాలు ఫర్హాన్ అక్తర్ మిల్కా సింగ్ పాత్రను పోషించగా.. దివ్య దత్తా, సోనమ్ కపూర్ మరియు యోగరాజ్ సింగ్ ఇతర కీలక పాత్రలు చేశారు. 


ఎంఎస్ ధోనీ:
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జీవితం ఆధారంగా వచ్చిన సినిమానే 'ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ'. ఈ సినిమాలో దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. మహీ పాత్రలో అదరగొట్టారు. 2016లో వచ్చిన ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ధోనీ బాల్యం నుంచి శ్రీలంకతో జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్‌ వరకు ఆడబితంగా చూపించారు నీరజ్. ఈ సినిమా ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలిచింది. 


Also Read: పాకిస్థాన్‌పై భారత్ సూపర్‌ విక్టరీ.. వైరల్ అవుతోన్న మీమ్స్! అచ్చు చరణ్-ఎన్టీఆర్‌లా హార్దిక్-జడేజా


Also Read: జడేజా నువ్వు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావా.. మంజ్రేకర్ ప్రశ్నకు జడ్డూ రియాక్షన్ ఏంటంటే?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి