వెల్లింగ్టన్‌ : న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను టీమిండియా చాలా పేలవంగా ప్రారంభించింది. వెల్లింగ్టన్‌ వేదికగా  జరుగుతున్న తొలి టెస్టులో భారత టాపార్డర్ తడబాటుకు లోనైంది. అయినా భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (34; 84 బంతుల్లో 5 ఫోర్లు) అరుదైన రికార్డు తనఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డమీద ఆతిథ్య జట్టుతో తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసిన భారత క్రికెటర్‌గా మయాంక్ నిలిచాడు. దీంతో 30 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన భారత ఓపెనర్ అయ్యాడు మయాంక్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ఐపీఎల్ 2020 షెడ్యూల్.. తొలి, చివరి మ్యాచ్ వారిదే!


గతంలో నేపియర్ వేదికగా 1990లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో మనోజ్ ప్రభాకర్ ఓపెనింగ్ చేసి తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 20 ఏళ్లకు నేడు వెల్లింగ్టన్ వేదికగా జరగుతున్న తొలి టెస్టులో తొలి సెషన్ మొత్తం మయాంక్ బ్యాటింగ్ చేయడం గమనార్హం. వీరిద్దరూ మినహా ఇప్పటివరకూ న్యూజిలాండ్ గడ్డమీద ఆ జట్టుమీద తొలి సెషన్ పూర్తిగా బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్లు లేరంటే నమ్మశక్యం కాదు.


Also Read: మొతెరా స్టేడియం ప్రత్యేకతలు ఇవిగో..


కాగా, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 100 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలుత ఓపెనర్ పృథ్వీ షా(16) రెండు ఫోర్లు కొట్టి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా టిమ్‌ సౌథీ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.  చటేశ్వర్‌ పుజారా (11), కెప్టెన్ విరాట్ కోహ్లీ (2), ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదరగొట్టిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి(7) పూర్తిగా విఫలమయ్యారు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో జేమిసన్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్ రూపంలో మయాంక్ (34) ఔటయ్యాడు.


See Pics: టాప్ లేపిన ముద్దుగుమ్మలు!  


ప్రస్తుతం అజింక్య రహానే (38; 122 బంతుల్లో 4 ఫోర్లు), , రిషబ్ పంత్ (10; 37 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. 55 ఓవర్లు ముగిసేసరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. కాగా కివీస్‌ బౌలర్లలో జేమిసన్‌ 3 వికెట్లు సాధించాడు. ట్రెంట్ బౌల్ట్‌ , సౌథీ చెరో వికెట్‌ తీశారు.


See Pics: టాప్ లేపిన ముద్దుగుమ్మలు!


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..