India vs England: జూలై 1 నుంచి భారత్-ఇంగ్లండ్ ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది. మ్యాచ్‌కు ముందే టీమిండియాకు ఎదురుదెబ్బలు తగుతున్నాయి. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డారు. అతడు ఆడతాడో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. మరో కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ సైతం గాయపడ్డాడు. దీంతో ఎడ్జ్‌ బాస్టన్ టెస్ట్‌లో ఎవరూ ఓపెనింగ్ చేస్తారన్న ఆసక్తి నెలకొంది. యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ అందుబాటులో ఉన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐతే మరో ఆటగాడి కోసం టీమిండియా ఎదురు చూస్తోంది. ఈక్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యువ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ను ఇంగ్లండ్‌కు పంపింది. ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ కోసం అతడిని సెలెక్టర్లు ముందే ఎంపిక చేశారు. ఐతే టీమ్‌తోపాటు అగర్వాల్‌ను పంపలేదు. పరిస్థితులను బట్టి పంపుతామని ఇదివరకే ప్రకటించారు. ఇటీవల భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకడంతో మయాంక్‌ అగర్వాల్‌ను ఇంగ్లీష్‌ దేశానికి పంపించారు.


ఈక్రమంలోనే అతడు ఇంగ్లండ్ వెళ్లాడు. కాసేపట్లో జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ టూర్‌లో బయోబబుల్ లేకపోవడంతో ఎలాంటి క్వారంటైన్ లేకుండా జట్టుతో చేరుతాడని..అవసరమైతే ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈఏడాది మార్చిలో శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో అగర్వాల్ ఆడాడు. ఒక్క మ్యాచ్‌ అడిన అతడు 59 పరుగులు చేశాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్‌లో విఫలమయ్యాడు. 


అతడి ఫామ్‌ బట్టి టెస్ట్‌ మ్యాచ్‌లో అవకాశం ఉండకపోవచ్చని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మయాంక్‌ అగర్వాల్‌ను పంపినట్లు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే ఓపెనర్‌గా గిల్‌ ఉన్నాడని..మరో ఓపెనింగ్ స్థానంలో మరో యువ ఆటగాడిని ఆడించే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల రాణించిన శ్రీకర్ భరత్‌ను తీసుకునే ఉద్దేశం ఉందని అంటున్నారు. గతంలో పుజారా సైతం ఓపెనింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అతడి చేత ఓపెనింగ్ చేయించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు విశ్లేషకులు.


Also read:CM Jagan on Opposition: మీ పాలనలో పిల్లల గురించి ఆలోచించారా..ప్రతిపక్షాలపై సీఎం జగన్ ధ్వజం..!


Also read:Health Benefits Of Flowers: ఈ పూల వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి