MI vs CSK: ఐపీఎల్‌లో ఆ రెండు జట్ల పోరు భారత్-పాక్ మ్యాచ్‌ను తలపిస్తుంది.. హర్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Harbhajan Singh compares India vs Pakistan match with MI vs CSK clash. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ భారత్, పాకిస్థాన్ పోరును తలపిస్తోందని మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు.
Harbhajan Singh compares India vs Pakistan match with MI vs CSK clash: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగనున్న ఈ ఆసక్తికర పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 2022లో చెన్నై, ముంబై జట్లు పేలవ ప్రదర్శన చేస్తున్నా.. మాజీ ఛాంపియన్ జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లు రసవత్తరంగా సాగడంతో నేటి మ్యాచుపై భారీ హైప్ నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ భారత్, పాకిస్థాన్ పోరును తలపిస్తోందని మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. 'నేను ముంబైఎం చెన్నై జట్ల తరఫున ఆడాను. రెండు జట్లు వేటికవే ప్రత్యేకమైనవి. అందుకే ఐపీఎల్ టోర్నీలో చెన్నై, ముంబై జట్ల మధ్య మ్యాచ్ అంటే నాకు భారత్, పాకిస్థాన్ పోరే గుర్తుకొస్తుంది. చెన్నై తరఫున ఆడినప్పుడు మ్యాచ్ త్వరగా అయిపోవాలని కోరుకునేవాడిని. ఎందుకంటే మ్యాచ్‌లో పోటీనే కాకుండా భావోద్వేగాలతో పాటు ఒత్తిడి అధికంగా ఉంటుంది' అని స్టార్ స్పోర్ట్ లైవ్‌లో భజ్జీ అన్నారు.
ఐపీఎల్‌లో మొత్తం 3 జట్లకు ఆడిన హర్భజన్ సింగ్.. 10 ఏళ్ల పాటు ముంబై ఇండియన్స్‌లో సభ్యుడిగా ఉన్నారు. ముంబై తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రెండు సీజన్లలో ఆడారు. ఆపై కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడారు. ఆపై అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి హర్భజన్ తప్పుకున్నారు. ప్రస్తుతం భజ్జీ ఆప్ ఎంపీగా ఉన్నారు. భారత్ తరఫున హర్భజన్ 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడారు. ఇక 163 ఐపీఎల్ మ్యాచులు ఆడారు.
ఇక ఐపీఎల్ 15వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో చెన్నై ఒకే ఒక్క విజయం నమోదు చేయగా.. ముంబై మాత్రం ఇంకా బోణీ కూడా చేయలేదు. దాంతో నేటి మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. మ్యాచ్ గెలిచేందుకే చూస్తాయి. దాంతో రసవత్తర పోరు జరగడం ఖాయం. మరోవైపు హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. చెన్నై, ముంబై జట్ల మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు జరగ్గా.. చెన్నై 19, ముంబై 13 మ్యాచ్‌ల్లో విజయాలు అందుకున్నాయి.
Also Read: Vehicles Honking: వాహన దారులారా.. జర జాగ్రత్త! హైదరాబాద్‌లో ఇకపై హారన్ కొడితే అంతే సంగతులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.