Mumbai Indians player Arjun Tendulkar Finally gets IPL Entry vs Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ పాయింట్స్ టేబుల్‌లో చిట్టచివరి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై.. 15వ సీజన్‌లో ఆడిన 13 మ్యాచులో 3 విజయాలు మాత్రమే అందుకుని ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పసలేకపోవడమే ముంబై ఓటములకు అసలు కారణం. ఇక మిగిలిన ఒక్క మ్యాచులో అయినా గెలిచి ఈ సీజన్‌ను విజయంతో ముగించాలని రోహిత్ సేన చూస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో సరైన జట్టు కూర్పు కుదరక ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చాలా మంది ఆటగాళ్లను ట్రై చేశాడు. కేవలం తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మాత్రమే పర్వాలేదనిపించాడు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మెరుపులు ఒకటి రెండు మ్యాచులకే పరిమితం అయ్యాయి. అయితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్.. ఐపీఎల్ 2021, 2022లో ముంబై జట్టులో ఉంటున్నా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రెండు సీజన్లలో 27 వరుస గేమ్‌లలో అతడు బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు.  


దాంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ ఎంట్రీ ఎప్పుడు అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు యాజమాన్యంను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు 22 మంది ఆటగాళ్లు 13 గేమ్‌లలో ఆడారు. అందులో హృతిక్ షోకీన్, కుమర్ కార్తికేయ సింగ్ లాంటి ప్లేయర్స్ ఐపీఎల్ టోర్నీలో అరంగేట్రం చేశారు. మరి మంచి ఆల్‌రౌండర్‌ అయిన అర్జున్ టెండూల్కర్‌ను ఒక్క మ్యాచులో కూడా తీసుకోకపోవడంతో సచిన్ అభిమానులు ముంబై జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


విమర్శల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా అర్జున్ టెండూల్కర్ ఎంట్రీపై పరోక్షంగా కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేశాం, తదుపరి మ్యాచులో కూడా బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం అని అన్నాడు. దాంతో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచులో అర్జున్ ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. 


Also Read: Venkatesh Remuneration: 'ఎఫ్ 3'కి మూడురెట్ల పారితోషికం.. వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?


Also Read: Virat Kohli Record: విరాట్ కోహ్లీ రేర్ రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే 'ఒకే ఒక్కడు'!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook