గంజాయి వ్యాపారంలోకి మైక్ టైసన్..!
మారిజూనా.. దీనినే కొన్ని ప్రాంతాల్లో దేశీయ గంజాయి అని కూడా అంటారు. మాజీ హెవీ వెయిట్ బాక్సర్ మైక్ టైసన్ ప్రస్తుతం ఇదే బిజినెస్ చేయాలని సంకల్పించారట
మారిజూనా.. దీనినే కొన్ని ప్రాంతాల్లో దేశీయ గంజాయి అని కూడా అంటారు. మాజీ హెవీ వెయిట్ బాక్సర్ మైక్ టైసన్ ప్రస్తుతం ఇదే బిజినెస్ చేయాలని సంకల్పించారట. అయితే ఆయన ఈ వ్యాపారం చట్టవ్యతిరేకంగా ఏమీ చేయడం లేదు. ప్రభుత్వం నుండి అనుమతి పొంది మరీ.. ఓ మంచి పనికే ఆయన చేస్తున్నారు.
అమెరికాలోని లాస్ ఏంజెలీస్‌కు 110 మైళ్ల దూరంలో ఉన్న 40 ఎకరాల భూమిని టైసన్ లీజుకి తీసుకొని మెడికల్ పరిశోధనలకు, మందులు తయారుచేయడానికి అవసరమయ్యే గంజాయి పంటను పండించనున్నారని.. తద్వారా అనేకమందికి ఉపాధి కలిగించబోతున్నారని ఇటీవలే కాలిఫోర్నియా సిటీ మేయర్ జెన్నిఫర్ ఉడ్ తెలిపారు. ఈ పని చేస్తున్నందుకు టైసన్‌ను ఆయన అభినందించారు కూడా.
ప్రస్తుతం టైసన్ "టైసన్ కల్టివేషన్ స్కూలు' పేరుతో ఒక సంస్థను నడుపుతున్నారు. స్థానిక రైతులకు లాభదాయకమైన పంటలు ఎలా వేయాలో ఈ సంస్థ శిక్షణ ఇస్తోంది.