అంతర్జాతీయ బాక్సింగ్ సూపర్ స్టార్ మైక్ టైసన్ టెన్నిస్ ఆడుతూ తన అభిమానులందరినీ సోషల్ మీడియాలో అలరించారు. తన కుమార్తె మిలన్‌‌తో కొంచెం సేపు టెన్నిస్ ఆడిన టైసన్  దానికి సంబంధించిన వీడియోను ఫేస్బుక్‌లో పోస్టు చేశారు. 1985 నుండి 2005 వరకు అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా రాణించిన మైక్ టైసన్, పేరొందిన ప్రపంచ బాక్సర్లలో ఒకరు. అలాగే ప్రపంచ బాక్సింగ్ చరిత్రను తిరగరాసిన వ్యక్తి కూడా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన కెరీర్‌లో ఎంతగా పేరుగడించాడో.. అన్నే వివాదాలను సొంతం చేసుకున్న వ్యక్తి మైక్ టైసన్. ఆయన పై పలు కేసులు కూడా నమోదయ్యాయి. మూడుసార్లు వివాహం చేసుకున్న టైసన్‌కి మొత్తం ఏడుగురు సంతానం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు బహిరంగ మద్దతు ఇచ్చి కూడా వార్తల్లో నిలిచారు మైక్ టైసన్. బాక్సింగ్ క్రీడాకారుడిగానే కాకుండా గుప్తదానాలు చేసే వ్యక్తిగా కూడా టైసన్‌కు పేరుంది. టైసన్ చేసే స్వచ్ఛంద కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకొని ఓహియో విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేటు ఇవ్వడం గమనార్హం.