Milkha Singh dies of COVID-19: కరోనాతో మిల్కా సింగ్ మృతి
Milkha Singh passes away due to COVID-19: న్యూ ఢిల్లీ: మిల్కా సింగ్ ఇక లేరు. దేశం గర్వించదగిన అథ్లెట్‌గా పేరు తెచ్చుకున్న మిల్కా సింగ్ కరోనాతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కరోనాకు చికిత్స పొందుతున్న మిల్కా సింగ్ శుక్రవారం రాత్రి పరిస్థితి మరింత విషమించి తుది శ్వాస విడిచారు (Milkha Singh`s death).
Milkha Singh passes away due to COVID-19: న్యూ ఢిల్లీ: మిల్కా సింగ్ ఇక లేరు. దేశం గర్వించదగిన అథ్లెట్‌గా పేరు తెచ్చుకున్న మిల్కా సింగ్ కరోనాతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కరోనాకు చికిత్స పొందుతున్న మిల్కా సింగ్ శుక్రవారం రాత్రి పరిస్థితి మరింత విషమించి తుది శ్వాస విడిచారు (Milkha Singh's death). ప్రస్తుతం ఆయన వయస్సు 91 ఏళ్లు. కరోనా కారణంగానే ఐదు రోజుల క్రితం జూన్ 13న మిల్కా సింగ్ భార్య నిర్మల్ కౌర్ చనిపోయారు. ఇప్పుడు ఇలా మిల్కా సింగ్ కూడా ప్రాణాలు విడవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆసియా గేమ్స్‌లో నాలుగుసార్లు గోల్డ్ మెడల్ గెల్చుకున్న మిల్కా సింగ్ కెరీర్ ఎంతో మంది అథ్లెట్స్‌కి స్పూర్తిధాయకం. 1958 కామన్వెల్త్ గేమ్స్ లోనూ మిల్కా సింగ్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు. మిల్కా సింగ్, నిర్మల్ కౌర్ దంపతులకు కుమారుడు జీవ్ మిల్కా సింగ్, ముగ్గురు కుమార్తెలు డా మోనా సింగ్, అలీజా గ్రోవర్, సోనియా సన్వల్కా (Milkha Singh family) ఉన్నారు. కుమారుడు జీవ్ మిల్కా సింగ్ గోల్ఫర్‌గా రాణిస్తున్నాడు.
Also read: 2 shots in 5 minutes gap: 5 నిమిషాల వ్యవధిలోనే కొవీషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్స్
మిల్కా సింగ్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ భాగ్ మిల్కా భాగ్ (Bhaag Milkha Bhaag) విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ఫరాన్ అక్తర్ మిల్కా సింగ్ పాత్రలో నటించి మెప్పించాడు. మిల్కా సింగ్ కరోనాతో (COVID-19) మృతి చెందిన నేపథ్యంలో దేశంలోని అన్నిరంగాల ప్రముఖులు మిల్కా సింగ్ సేవలను గుర్తుచేసుకుంటూ ట్విటర్ ద్వారా ఆయన మృతికి నివాళి అర్పిస్తున్నారు.
Also read : Anandaiah mandu: ఆనందయ్య మందు పంపిణీపై MP Vijayasai Reddy ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook