Mitchell Marsh Viral Photo: వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకున్న టీమిండియాను.. ఆఖరిపోరులో ఓడించి ఆసీస్ వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్‌ ఫైట్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఫైనల్‌లో టీమిండియా అనూహ్యంగా ఓడిపోవడం కోట్లాది మంది అభిమానుల గుండె కోతలను మిగిల్చింది. లక్షా 30 వేల మందితో నిండిపోయిన అహ్మదాబాద్ స్టేడియం ఆదివారం మూగవోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోహిత్ శర్మ ఔట్ అవ్వడంతోనే మ్యాచ్ కల తప్పింది. ఆసీస్ బ్యాటింగ్ సమయంలో ఆరంభంలోనే 3 వికెట్లు తీయడంతో కప్ స్టేడియం మోతమోగింది. అక్కడి నుంచి ఆస్ట్రేలియా ఛాన్స్‌ ఇవ్వలేదు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. మరో 6 వికెట్లు.. 7 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తిచేసి విశ్వకప్‌ను ఛేజిక్కించుకుంది. ట్రావిస్ హెడ్ అద్భుత సెంచరీతో చెలరేగగా.. లబూషేన్ హాఫ్ సెంచరీతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లో కప్ గెలిచిన ఆసీస్ సంబరాల్లో మునిగిపోగా.. మిచెల్ మార్ష్ ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.


ప్రపంచకప్ గెలవడం అంటే ఆటగాళ్లకే కాదు.. మొత్తం యావత్ దేశానికే గర్వకారణం. కానీ ఆ గర్వం తలకెక్కకూడదు. ప్రపంచకప్ గెలిస్తే ట్రోఫీని ముద్దాడుతూనో.. నెత్తి మీద పెట్టుకొనో.. చేతిలో పట్టుకొనో ఫొటోలకు పోజలిస్తారు. కానీ మిచెల్ మార్ష్‌ తీరు మాత్రం మరోలా ఉంది. వరల్డ్ కప్‌పై కాళ్లు పెట్టి.. చేతిలో బీర్‌తో ఫొటోలకు పోజిలిచ్చాడు. అంతేకాదు ప్రపంచం మొత్తం మాకు దాసోహం అనే రీతిలో ఫొటో దిగాడు. మేమే ప్రపంచ ఛాంపియన్లం అనే గర్వం మార్ష్ ముఖంలో స్పష్టంగా కనిపించింది.


 




ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింగ వైరల్ అవుతుండగా.. క్రికెట్ అభిమానులు, టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మార్ష్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఐసీసీని రిక్వెస్ట్ చేశారు. కప్‌ను నెత్తిన పెట్టుకుని గౌరవించాల్సిందిపోయి.. ఇలా కాళ్ల కింద పెట్టుకుని అవమానిస్తాడా..? అని తిడుతున్నారు. దేవుడు కూడా అనర్హులకే పట్టకడతాడని.. విలువ తెలియనివాళ్లకే వద్దకే అత్యంత విలువైనవి ఇస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లు గుండెల్లో పెట్టుకుని వరల్డ్ కప్‌ను ముద్దాడేవారని.. ఆసీస్ ఆటగాడికి బలుపు మాములుగా లేదని విమర్శిస్తున్నారు. 



 



Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!


Also Read: Ind vs Aus Final: కర్ణుడి చావుకు కారణాలనేకం, టీమ్ ఇండియా ఓటమికి కూడా ఇదే కారణం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook