Anil Kumble and VVS Laxman sent their wishes for Mithali Raj on retirement: మహిళా క్రికెట్ దిగ్గజం, టీమిండియా వన్డే మరియు టెస్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. బుధవారం (జూన్ 8) అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మిథాలీ సుమారు 23 ఏళ్ల పాటు భారత జ‌ట్టుకు ప్రాతినిథ్యం వహించారు. సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాలనుకుంటున్నానని మిథాలీ పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుదీర్ఘ కాలం పాటు భారత మహిళా క్రికెట్‌కు సేవలందించిన మిథాలీ రాజ్.. రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆమె రెండో ఇన్నింగ్స్‌ బాగుండాలని బీసీసీఐ, ఐసీసీతో పాటు పలువురు క్రీడాకారులు ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. 'క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన మిథాలీ రాజ్.. అంతర్జాతీయ కెరీర్‌లో అత్యుత్తమ సమయం వెచ్చించారు' అని ఐసీసీ ట్వీట్ చేసింది. 


'మిథాలీ రాజ్.. భారత క్రికెట్‌కు మీరు అందించిన సేవలు అసాధారణమైనవి. కెరీర్‌లో అద్భుతంగా రాణించారు. మీరు గొప్ప వారసత్వాన్ని మిగిల్చారు. మీ రెండవ ఇన్నింగ్స్‌ బాగుండాలని కోరుకుంటున్నాం' అని బీసీసీఐ ట్వీట్ చేసింది. 


'అద్భుతమైన కెరీర్ ముగిసింది. భారత క్రికెట్‌కు అపారమైన సహకారం అందించిన మిథాలీ రాజ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. మైదానంలో మీ నాయకత్వం జాతీయ మహిళా జట్టుకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది. మైదానంలో మీ అద్భుతమైన ఇన్నింగ్స్‌లకు ధన్యవాదాలు. మీ తదుపరి ఇన్నింగ్స్‌కు బాగుండాలని కాంక్షిస్తున్నా' అని బీసీసీఐ సెక్రటరీ జై షా పేర్కొన్నారు. 


'టీమిండియా కోసం ఆడాలని చాలా కొద్దిమంది మాత్రమే కలలు కంటారు. 23 సంవత్సరాల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గొప్ప విషయం. మీరు భారత దేశంలో మహిళల క్రికెట్‌కు మూల స్తంభంగా ఉన్నారు. చాలా మంది యువ మహిళా క్రికెటర్ల జీవితాలను తీర్చిదిద్దారు. మీ అద్భుతమైన కెరీర్‌కు ప్రత్యేక అభినందనలు' అని హైదరాబాద్ సొగసరి వీవీఎస్‌ లక్ష్మణ్ అన్నారు. 



'అద్భుతమైన కెరీర్‌ని పూర్తి చేసుకున్న మిథాలీ రాజ్‌కు శుభాకాంక్షలు. మీరు ఎంతో మందికి రోల్ మోడల్, స్ఫూర్తి. మీ రెండో ఇన్నింగ్స్‌లో మంచి జరగాలని కోరుకుంటున్నాను' అని టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్‌ కుంబ్లే ట్వీటారు. 


'కెరీర్‌ ముగింపు వరకు మిథాలీ తన సహచర క్రికెటర్ల కంటే ఎక్కువ కాలం ఫామ్‌లో ఉంది. భారత క్రికెట్‌కు మిథాలీ ఎంతో సేవ చేశారు. మిథాలీ.. మీ రెండో ఇన్నింగ్స్‌ బాగుండాలని కోరుకుంటున్నా' అని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ పేర్కొన్నారు.




Also Read: IND vs SA 3rd T20I: హాట్‌కేకుల్లా ఆన్‌లైన్‌ టికెట్లు.. గంటలోనే ఖతం! విశాఖపట్నంలో ఆఫ్‌లైన్‌లో కొనాలంటే.. 


Also Read: దారుణం.. పబ్‌జీ ఆడొద్దన్నందుకు తల్లినే కాల్చి చంపిన 16 ఏళ్ల బాలుడు.. 2 రోజులు ఇంట్లోనే మృతదేహం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి