IND vs PAK: `మొహ్మద్ నవాజ్` భయ్యా అస్సలు బాధపడకు.. నువ్ ఎప్పటికీ మ్యాచ్ విన్నర్వే: బాబర్ అజామ్
Mohammad Nawaz is always a match winner, Babar Azam Golden Words to Pakistan players. టీమిండియాపై ఓడి నిరాశకు గురైన పాకిస్తాన్ జట్టు సభ్యులలో కెప్టెన్ బాబర్ అజామ్ స్ఫూర్తి నింపాడు.
IND vs PAK, Babar Azam Golden Words to Pakistan players: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా టీమిండియాపై ఓడి నిరాశకు గురైన పాకిస్తాన్ జట్టు సభ్యులలో ఆ టీం కెప్టెన్ బాబర్ అజామ్ స్ఫూర్తిని నింపాడు. మనం జట్టుగా ఓడిపోయామని.. ఒక్కరి కారణంగా మ్యాచ్ ఓడలేదని ఆటగాళ్లతో చెప్పాడు. మొహ్మద్ నవాజ్ బాధపడాల్సిన అవసరం లేదని.. అతడో మ్యాచ్ విన్నర్ అని మద్దతు పలికాడు. తప్పుల నుంచి త్వరగా నేర్చుకుని ముందుగా సాగుదామని జట్టు సభ్యులతో బాబర్ అజామ్ చెప్పాడు. టీమిండియాతో ఆదివారం జరిగిన సూపర్ 12 మ్యాచులో పాక్ చివరి బంతి వరకు పోరాడి ఓడిపోయింది. పాక్ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ చివరి బంతికి ఛేదించింది.
మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ప్లేయర్స్ అందరూ డ్రెస్సింగ్ రూంలో కూర్చుని బాధపడుతుండగా.. హెడ్ కోచ్ మాథ్యూ హేడెన్ వచ్చి వారిలో స్ఫూర్తిని నింపాడు. ఆపై కెప్టెన్ బాబర్ అజామ్ మాట్లాడుతూ... 'బ్రదర్స్ మనం మంచి మ్యాచ్ ఆడాం. ఎప్పటిలానే మనం శక్తికి మించి పోరాడాం. అప్పుడపుడు ఓడిపోతుంటాం. దాన్ని నుంచి మనం నేర్చుకోవాలి కానీ.. ఇలా నిరాశపడకూడదు. టీ20 ప్రపంచకప్ 2022 ఇప్పుడే మొదలైంది. మనకు చాలా మ్యాచులు ఉన్నాయి. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి' అని అన్నాడు.
'మనం జట్టుగా ఓడిపోయాం. ఒక్కరి కారణంగా మ్యాచ్ ఓడలేదు. అతడి వల్లే ఓడిపోయామని పాయింట్ ఔట్ చేయడం సరికాదు. జట్టుగా ఓడిపోయాం.. జట్టుగానే గెలుస్తాం. దీనికి అందరూ కట్టుబడి ఉండాలి. మనం మంచి ప్రదర్శన చేసాం. అది కూడా ఆలోచించండి. చాలామంది బాగా ఆడారు. చిన్నచిన్న తప్పులు జరుగుతుంటాయి. జట్టుగా సరిద్దుకోవాలి. మొహ్మద్ నవాజ్ బాధపడాల్సిన అవసరం లేదు. నువ్ నాకు ఎపుడూ మ్యాచ్ విన్నర్వే. నువ్ జట్టు కోసం మ్యాచులు గెలిచావ్. ఇది ఒత్తిడితో కూడుకున్న మ్యాచ్. విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయాం. అన్ని ఇక్కడే వదిలేసి కొత్తగా ప్రయాణం మొదలుపెడదాం. అందరికీ ఆల్ ది బెస్ట్' అని బాబర్ జట్టు సభ్యులతో చెప్పాడు.
Also Read: చివరి బంతికి సింగల్ తీసిన అశ్విన్.. స్మార్ట్ టీవీ పగలగొట్టిన అభిమాని! వీడియో చూస్తే బిత్తరపోతారు
Also Read: 'మొహ్మద్ నవాజ్' నువ్వే మా హీరో.. నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం! లవ్ యూ భయ్యా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి