Mohammed Shami: మొహ్మద్ షమీ చెవులు పిండిన ఆర్ అశ్విన్.. నొప్పితో విలలాడిన భారత పేసర్! వైరల్ ఫోటో
R Ashwin pulls Mohammed Shami ears during India vs Australia 2nd Test. ఆర్ అశ్విన్ సరదాగా మొహ్మద్ షమీ చెవులు పిండడంతో టీమిండియా క్రికెటర్లు నవ్వులు పూయించారు.
R Ashwin pulls Mohammed Shami ears at IND vs AUS 2nd Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు రెండో టెస్ట్ ఆరంభం అయింది. ఢిల్లీ టెస్టులో ఇరు జట్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 రన్స్ చేసింది. క్రీజ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (4) ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా (81), పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (72) అర్ధ శతకాలు చేశారు. మహమ్మద్ షమీ (4/60) 4 వికెట్స్ పడగొట్టాడు.
రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో వికెట్‌ను భారత పేసర్ మొహ్మద్ షమీ పడగొట్టాడు. పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌కు అండగా నిలుస్తున్న స్పిన్నర్ నాథన్ లియోన్ వికెట్ షమీ తీశాడు. లియోన్ క్లీన్‌బౌల్డ్ అవ్వడంతో షమీ ఖాతాలో మూడో వికెట్ చేరింది. వికెట్ సెలబ్రేషన్ సమయంలో షమీ వెనుక నుంచి వచ్చిన వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్.. గుడ్ బౌలింగ్ అంటూ చెవులు పిండాడు. అయితే అశ్విన్ గట్టిగా రెండు చెవులను పిండడంతో షమీ నొప్పితో విలలాడిపోయాడు. ఒక్కసారిగా షమీ మొహం మారిపోయింది.
ఆర్ అశ్విన్ సరదాగా మొహ్మద్ షమీ చెవులు పిండడంతో టీమిండియా క్రికెటర్లు నవ్వులు పూయించారు. ఇందుకు సంబందించిన వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. CricTelegraph తన ట్విట్టర్ ఖాతాలో ఫొటోస్ పోస్ట్ చేసింది. ఈ ఫొటోకు లైకుల, కామెంట్లు వస్తున్నాయి. ఫొటో చూసి ఫాన్స్ 'కొంచెం చిన్నగా పిండరాదయా', 'పాపం షమీ', 'నొప్పి గట్టిగానే పెట్టినట్టుంది' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ మ్యాచులో మొత్తంగా షమీ నాలుగు వికెట్లతో చెలరేగాడు.
Also Read: జస్ట్ మిస్.. బ్లాక్ కింగ్ కోబ్రా కాటు నుంచి స్నేక్ క్యాచర్ ఎస్కేప్! డేంజరస్ వీడియో
Also Read: పాత ఇంట్లో 16 అడుగుల కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపింది! చివరకు ఏమైందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.