దాదాపు ఆరు నెలలు ఆలస్యమైనా మరో నెల రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ప్రారంభం కానుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌లను యూఏఈలో నిర్వహించనున్నారు. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు యూఏఈకి చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లోగా మిగతా జట్లు అక్కడికి వెళ్లనున్నాయి. Suresh Raina Reply To PM Modi: ప్రధాని మోదీ లేఖపై స్పందించిన సురేష్ రైనా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది విదేశాల్లో నిర్వహిస్తుండటంతో ఏ జట్టుకు కలిసొస్తుంది, ఏ జట్టుకు అవకాశాలున్నాయి అనే అంచనాలు మొదలయ్యాయి. అయితే మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఓ విషయంపై స్పందించాడు. ఐపీఎల్ 2020లో ప్రమాదకర ఓపెనింగ్ ఎవరంటే.. ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ-క్వింటన్ డికాక్ లేదా రోహిత్ శర్మ- క్రిస్ లిన్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్- జానీ బెయిర్‌స్టో, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ ఓపెనర్లు కేఎల్ రాహుల్- క్రిస్ గేల్ జోడీలలో ఒకటి డేంజరస్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్స్‌గా నిలుస్తుందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. Vijay Shankar Engagement Photos: వేడుకగా క్రికెటర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం


సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 13వ సీజన్ జరగనుంది. 60 రోజులపాటు ఈ క్యాష్ రిచ్ లీగ్ వినోదాన్ని పంచనుంది. ఆటగాళ్లు బయో బబుల్‌లో ఉండాల్సి వస్తుంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకునేలా ఉన్నారు. ఐపీఎల్ మొదలయ్యేవరకు ఆటగాళ్లకు 5సార్లు కోవిడ్19నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్ 
‘చిరుత’ కన్నుల చిన్నది Neha Sharma Hot Photos