MS Dhoni Bike: సింగల్ హ్యాండ్‌తో భారీ హెలికాఫ్టర్ షాట్ కొట్టే ఎంఎస్ ధోనీ.. బైక్ కిక్ కొట్టలేకపోయాడు! వైరల్ వీడియో
MS Dhoni seen pushing his bike at House, Video Goes Viral. ఎంఎస్ ధోనీ రాక కోసం అతని అభిమాని అయిన ఓ యూట్యూబర్ ఎదురుచూస్తుండగా.. మహీ తన బైక్‌పై ఇంటి లోపలి వెళ్లారు.
India Former Captain MS Dhoni could not hit the bike kick: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా 17 సంవత్సరాలు క్రికెట్‌తో బిజీబిజీగా గడిపిన మహీ.. ప్రస్తుతం రాంచీలో తన కుటుంబంతో కలిసి ఆనంద జీవితాన్ని గడుపుతున్నాడు. సతీమణి సాక్షి ధోనీ, కూతురు జీవా ధోనీతో కలిసి సరదాగా గడుపుతున్నారు. కుటుంబ సభ్యుల, స్నేహితుల ఫంక్షన్స్ ఉంటే తప్ప మహీ ఎక్కువగా బయటికి బయటికి రావడం లేదు.
మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోనీని చూడాలని లేదా కలవాలని అతడి అభిమానులు నిరంతరం ఆసక్తిగా ఉంటారు. అయితే భారత మాజీ కెప్టెన్ రాంచీలో తన ఫామ్ హౌస్‌లో ఉండడం, సోషల్ మీడియాకు దూరం ఉండడం వల్ల మహీ అప్ డేట్స్ అస్సలు బయటి రావు. ధోనీని చూడటానికి అభిమానులు నెలల తరబడి వేచి ఉండాల్సి ఉంటుంది. అయినా కూడా కొందరు ఫాన్స్ వేచి ఉండి మరీ.. తన అభిమాన క్రికెటర్‌ని చూసి సంబరపడతారు. తాజాగా ఓ యూట్యూబర్ రాంచీకి వెళ్లి ధోనీని చూసేందుకు చాలాసేపు వెయిట్ చేశాడు. చివరకు ధోనీని కలవకున్నా.. దూరం నుంచి చూసి సంతోషపడ్డాడు.
ఎంఎస్ ధోనీ రాక కోసం అతని అభిమాని అయిన ఓ యూట్యూబర్ ఎదురుచూస్తుండగా.. మహీ తన బైక్‌పై ఇంటి లోపలి వెళ్లారు. గేట్ నుంచి లోపలి వెళ్లే సమయంలో ధోనీ నడిపే యమహా బైక్ కాస్త సతాయించింది. బైక్‌ను స్టార్ట్ చేయడానికి మహీ కష్టపడ్డారు. 3-4 కిక్ కొట్టినా స్టార్ట్ కాలేదు. చివరకు బైక్ స్టార్ట్ అవడంతో మహీ అక్కడినుంచి వెళ్లిపోయారు. ధోనీ తన ద్విచక్ర వాహనాన్ని స్టార్ట్ చేయడంలో ఇబ్బంది పడుతున్న ఘటనను యూట్యూబర్ వీడియో తీశాడు. ఆ వీడియోకు 15 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 'సింగల్ హ్యాండ్‌తో హెలికాఫ్టర్ షాట్ కొట్టే ధోనీ.. బైక్ కిక్ కొట్టలేకపోయారు' అని ఫాన్స్ సరదాగా ట్వీట్ చేస్తున్నారు.
ఎంఎస్ ధోనీ 2020 ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. అంతర్జాతీయ కెరీర్‌లో 90 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4,876 పరుగులు చేశారు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్ బాదారు. ఇందులో 10 సెంచరీలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. 98 టీ20 మ్యాచ్‌లలో 1,617 పరుగుల చేశారు. ఇక ఐపీఎల్ టోర్నీలో 234 మ్యాచులు ఆడిన ధోనీ.. 4,978 రన్స్ బాదారు.
Also Read: Sourav Ganguly IPL 2023: సౌరవ్ గంగూలీకి కీలక బాధ్యతలు.. ఐపీఎల్ 2023తో రంగంలోకి!
Also Read: VVS Laxman India Coach: రాహుల్ ద్రవిడ్‌కు గుడ్‌బై.. టీమిండియా హెడ్ కోచ్‌గా హైదరాబాద్ ప్లేయర్!
లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.