Telugu Fans installed MS Dhoni's 41 feet cutout in Vijayawada: 2004లో ఎంఎస్ ధోనీని చూసి ఇండియ‌న్ క్రికెట్‌నే మ‌లుపు తిప్పే మొనగాడు వచ్చాడని ఎవ‌రూ ఊహించలేకపోయారు. రాహుల్ ద్రవిడ్ వారసుడి (వికెట్ కీపర్) కోసం వెతుకుతున్న స‌మ‌యంలో జుల‌పాల జుట్టుతో ధోనీ జట్టులోకి వచ్చాడు. వికెట్ కీపర్ పాత్ర‌ను సమర్ధవంతంగా పోషిస్తే చాలనుకున్నా.. కీపింగ్ నైపుణ్యంతో పాటు దూకుడైన ఆట‌తో జట్టులో సుస్థిర స్థానం సంపాదించాడు. కెప్టెన్‌గా అనుకోకుండా వ‌చ్చిన అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకుని టీమిండియాకు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ప్రపంచ క్రికెట్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకున్న ధోనీ పుట్టిన రోజు నేడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నేడు 41వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా యావత్ క్రికెట్ ప్రపంచం మహీకి బ‌ర్త్ డే విషెస్ తెలియజేస్తోంది. సోషల్ మీడియా మొత్తం ధోనీ నామస్మరణతో మార్మోగిపోతోంది. ప్రతిఒక్కరు సోషల్ మీడియా వేదికగా ధోనీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే తెలుగు అభిమానులు కొందరు ధోనీపై ఉన్న అభిమానంతో ఏకంగా 41 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ నెట్టింట వైరల్ అయింది. 


ఎంఎస్ ధోనీ తెలుగు ఫ్యాన్స్ అసోసియేషన్.. 41 అడుగుల భారీ కటౌట్‌ను విజయవాడలోని నందిగామలో ఏర్పాటు చేసింది. కటౌట్‌లో ధోనీ సిగ్నేచర్ హెలికాప్టర్ షాట్ ఆడుతున్న‌ ఫొటోను డిజైన్ చేశారు. ఈ క‌టౌట్‌ను అంబారుపేట గ్రామానికి చెందిన భువన్ చారీ, భరత్, సాయి, సిద్దు సహా మరికొందరు ధోనీ ఫాన్స్ ఏర్పాటు చేశారు. ధోనీ నేడు 41వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో 41 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేయాలనుకున్నాం అని పేర్కొన్నారు. గతంలో 2018లో కేరళలో 35 అడుగులు కౌటౌట్‌, చెన్నైలో 30 అడుగుల కటౌట్‌ను ఫాన్స్ ఏర్పాటు చేశారు. 



క్రికెట్ ప్రపంచంలోనే తనదైన సారథ్యంతో గొప్ప కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ఎంఎస్ ధోనీ.. ఎవరికీ సాధ్యం కానీ అరుదైన ఘనతను తన పేరుపై లిఖించున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన ధోనీ.. మూడు దశాబ్దాలుగా ఊరించిన ప్రపంచకప్‌ను 2011లో అందించి యావత్ భారతం ఉప్పొంగేలా చేశాడు. అనంతరం 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచి.. ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచిన ఏకైక సారథిగా రికార్డుల్లో నిలిచాడు. ఐసీసీ మూడు టైటిల్స్ ఇప్పటికీ ఎవరూ గెలవలేదు. 


Also Read: Girl Stunt Video: ఏదో చెయ్యాలనుకుంటే.. ఇంకేదో అయింది! ఈ అమ్మాయి స్టంట్ చూస్తే మైండ్ బ్లాంకే  


Also Read: Itching In The Sole: పాదాలలో దురదతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook