Chennai Super Kings Captain MS Dhoni Definitely will play IPL 2023: టీమిండియా మాజీ కెప్టెన్ 'ఎంఎస్ ధోనీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 20213 ఛాంపియన్ ట్రోఫీలు అందించి.. ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత అందించిన ఏకైక కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచారు. ఐపీఎల్ 2020 ముందు అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు. అయితే ధోనీ ఐపీఎల్ ఆడుతుండడంతో ఫాన్స్ అతడి ఆటను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఐపీఎల్ 2020 అనంతరం మహీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చినా.. అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మెగా లీగ్‌కు కూడా రిటైర్మెంట్ ఇస్తారని, అందుకే రవీంద్ర జడేజాకు జట్టు పగ్గాలు ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై.. ఈరోజు రాజస్థాన్ రాయల్స్‌పై చివరి లీగ్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచుకు ముందు ధోనీ ఏం నిర్ణయం తీసుకున్నాడో అని ఫాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. వినరాని వార్త ఏమైనా వింటామో అని కాస్త కలవరపడ్డారు. అయితే టాస్ కోసం మైదానంలోకి వచ్చిన మహీ.. అభిమానులకు శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాది బలంగా తిరిగి రావడానికి కృషి చేస్తానన్నారు.


తదుపరి సీజన్‌లో మీరు ఆడతారా అని ఎంఎస్ ధోనీని ఇయాన్ బిషప్ అడగ్గా.. 'ఖచ్చితంగా. సింపుల్ రీజన్ ఏంటంటే.. చెన్నైలో చివరి మ్యాచ్ ఆడకుంటే అభిమానులకు అన్యాయం చేసినట్టే. ముంబై అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం. అయితే ఇది చెన్నై అభిమానులకు కాదు. నాకు చెన్నై హోం గ్రౌండ్లో సీఎస్కే అభిమానుల మధ్య ఆడాలని ఉంది. వచ్చే సంవత్సరం ఎప్పటిలా అన్ని వేదికల్లో గేమ్స్ జరుగుతాయి. చెన్నైలో చివరి మ్యాచ్ ఆడాలి. అయితే ఇది నా చివరి ఐపీఎల్ అవుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. దీనిని అంచనా వేయలేం. ఖచ్చితంగా నేను వచ్చే ఏడాది బలంగా తిరిగి రావడానికి కృషి చేస్తాను' అని బదులిచ్చారు.  


2008లో జరిగిన మొదటి ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ భారీ ధరకు ఎంఎస్ ధోనీని కొనుగోలు చేసింది. చెన్నైకి మహీ ఏకంగా నాలుగు ట్రోఫీలు అందించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. మహీ చెన్నైని మాత్రం వదలలేదు. అతడికి ఫాన్స్ ముద్దుగా 'తలా' అని పిలుచుకుంటారు. తమిళనాడులో మహీకి పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. అందుకే అక్కడే చివరి మ్యాచ్ ఆడాలని మహీ అనుకుంటున్నాడు. 233 మ్యాచులు ఆడిన ధోనీ 4952 రన్స్ బాదారు. 


Also Read: Vikram Telugu Trailer: పదా చూస్కుందాం.. సూర్యోద‌యాన్ని చూడ‌బోయేది ఎవ‌రో! విక్ర‌మ్ తెలుగు ట్రైల‌ర్‌ అదుర్స్


Also Read: iPhone 13 Offer: ఐఫోన్ 13పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఏకంగా 42 వేల రూపాయల తగ్గింపు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook