MS Dhoni Retirement from IPL: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోని గుడ్‌బై..? CSK ఎమోషనల్ వీడియో
MS Dhoni Emotional Video: ఎంఎస్ ధోని ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్నాడా..? చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేసిన ఓ వీడియోతో మళ్లీ అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో తలైవా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
MS Dhoni Emotional Video: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ రథసారథి ఎంఎస్ ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడు..? ఇదే ప్రశ్న చెన్నై ఈ సీజన్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తరువాత ప్రశ్నించగా.. 'వీడ్కోలు పలికేందుకు ఇది చాలా మంచి సమయం. కానీ అభిమానుల ఉత్సాహం చూస్తుంటే ఆడాలనిపిస్తోంది. శరీరం సహకరిస్తే మరో సీజన్ ఆడతా. అందకు ఇంకా 7 నుంచి 8 నెలల సమయం ఉంది..' అని ధోని సమాధానం చెప్పాడు. దీంతో తలైవా అభిమానుల సంబురాలు చేసుకున్నారు. ధోనీని మరో సీజన్‌లో కూడా ప్లేయర్‌గా చూడొచ్చని ఆనందం వ్యక్తం చేశారు. అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసిన ఓ వీడియోతో మళ్లీ ఫ్యాన్స్‌లో మళ్లీ ఆందోళన మొదలైంది. ధోని రిటైర్మెంట్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
ధోని స్టెప్స్ ఎక్కుతూ వెళ్లిపోతుండగా.. కొన్ని ఫోటోలను యాడ్ చేసి వీడియోను విడుదల చేశారు. ఓ కెప్టెన్.. ఓమై కెప్టెన్ అంటూ Holding Back Tears ఎమోజీతో క్యాప్షన్ రాశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ధోని సేవలు గుర్తు చేసుకునే విధంగా ఉంది. 33 సెకెన్ల నిడివి గల వీడియో ధోని ప్రత్యేకతల గురించి చూపించారు. దీంతో ధోని రిటైర్మెంట్‌పై సీఎస్‌కే హింట్ ఇచ్చిందా..? అనే అనుమానాలు మొదలయ్యాయి. ధోని ఇప్పుడే రిటైర్ అవ్వొద్దంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: Earthquake In Delhi: భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు
ఐపీఎల్ 2023 ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై ఐదోసారి ట్రోఫీని గెలుచుకుంది. గతేడాది పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండోస్థానంలో నిలిచిన చెన్నై.. ఈసారి కప్ కొట్టిందంటే అందుకు ధోని కెప్టెన్సీనే కారణం. చెన్నై ట్రోఫీ గెలిచిన అనంతరం ధోనీ మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నాడు. చికిత్స విజయవంతమైంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసిన వీడియోతో ధోనీ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడా..? అని మళ్లీ డౌటానుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ విషయంపై ధోని ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్ జాయ్ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి