కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో పరాజయంపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టు సభ్యులు ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని ధోని అన్నారు. బౌలింగ్, ఫీల్డింగ్‌ విభాగాల్లో ఆటగాళ్లు విఫలం కావడంపై ధోని అసంతృప్తి వెలిబుచ్చారు. బౌలర్ల పంథా మారకుంటే వారిని తరచూ మార్చాల్సి వస్తుందని హెచ్చరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం జరిగిన మ్యాచ్‌లో లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను వదిలేసి, బౌలింగ్‌ ప్లాన్‌ను మరచిపోయి కోల్‌కతా బ్యాట్స్‌మన్లకు చెన్నై బౌలర్లు పరుగులు సమర్పించుకున్నారు. ఏడో ఓవర్‌‌లో క్రిస్‌‌లిన్‌, రాబిన్‌ ఉతప్ప, సునీల్‌ నరైన్‌లను చెన్నై బౌలర్లు పెవిలియన్‌కు పంపారు. ఆ తర్వాత వచ్చిన యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌, కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌లు జట్టును గెలిపించారు.  


అయితే ఫీల్డింగ్‌లో చెన్నై చేసిన పొరపాట్లు ధోనికి ఆగ్రహం తెప్పించాయి. ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్‌ వరుస బంతుల్లో ఇచ్చిన రెండు క్యాచ్‌లను ఉత్తమ ఫీల్డర్‌గా పేరున్న జడేజా వదిలేయడం కూడా ధోనీకి ఆగ్రహం తెప్పించింది. లోపాలను చూసుకోండి.. లేకపోతే కష్టమే అన్నట్లు ధోని చెప్పినట్లు తెలుస్తోంది.