వైరల్‌గా మారిన ధోనీ స్టంట్స్ స్లో మోషన్ వీడియో
ధోని స్టంట్స్ వీడియోకు లైకులే లైకులు..
ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత ఇండియాకు తిరిగొచ్చిన టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోని తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. రాంచిలోని తన సొంత నివాసంలోని మైదానంలో సైకిల్‌పై చేసిన ఓ చిన్న స్టంట్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 8.5 లక్షల లైక్స్ రావడం విశేషం. జస్ట్ సరదా కోసమే ట్రై చేశాను. దయచేసి మీరూ మీ ఇంటివద్ద ప్రయత్నించండి అంటూ ధోని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.
మహేంద్ర సింగ్ ధోని, అతడి శ్రీమతి సాక్షి ధోని ఇద్దరూ ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేసి అభిమానులను కనువిందు చేస్తున్నారు. ఈ సెలబ్రిటీ కపుల్ పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు అభిమానులను అలరిస్తే, వారిని విమర్శించాలకునే వారు మాత్రం ఆ ఇద్దరినీ ట్రోల్ చేస్తోన్న వైనం కూడా తెలిసిందే.
మూడు రోజుల క్రితం సాక్షి ధోనీ పోస్ట్ చేసిన ఓ ఫోటోలో ఆమె డ్రెస్సింగ్ సెన్స్ ఏమాత్రం బాగోలేదని ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే, ధోనీ, సాక్షి అభిమానులు కాస్త ధీటుగా స్పందించి అతడికి బుద్దొచ్చేలా చేశారు అది వేరే విషయంలెండి.