వైజాగ్‌కి శుభవార్త.. భారత క్రికెటర్ ఎం.ఎస్ ధోనీ తీసుకున్న అనూహ్య నిర్ణయం
విశాఖపట్నంతో భారత క్రికెటర్ ఎం.ఎస్ ధోనికి ఉన్న అనుబంధం ఎలాంటిదో మనకు తెలియంది కాదు.
విశాఖపట్నంతో భారత క్రికెటర్ ఎం.ఎస్ ధోనికి ఉన్న అనుబంధం ఎలాంటిదో మనకు తెలియంది కాదు. ఏప్రిల్ 5, 2005వ తేదిన పాకిస్తాన్‌తో విశాఖలో జరిగిన రెండవ వన్డేలో ధోని దుమ్ము రేపాడు. కేవలం 123 బంతులలో 148 పరుగులు చేసి.. ఆ రోజు భారత్ విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. తన అయిదవ వన్డేలోనే ధోని ఆ ఘనత సాధించి.. భారత్‌కు ఒక తిరుగులేని క్రికెటర్ లభించాడన్న సత్యాన్ని లోకానికి చాటాడు. ఆ తర్వాత.. ధోని కెరీర్ ఎలా ముందుకు దూసుకొని వెళ్లిందో మనకు తెలియంది కాదు.
తాజాగా.. ఎం.ఎస్.ధోని తాను నడుపుతున్న ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థ తరఫున వైజాగ్‌లో అంతర్జాతీయ క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు తగిన సహకారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకోనున్నారు. రూ.60 కోట్లతో రెండు దశల్లో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. మొదటి దశలో క్రికెట్ అకాడమీని నిర్మించనున్నారు. అలాగే ఓ అంతర్జాతీయ పాఠశాలను కూడా ధోని వైజాగ్‌లో నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
విశాఖపట్నానికి క్రికెట్‌తో మంచి అనుబంధమే ఉంది. దాదాపు 16 వన్డేలు, 83 టీ20లు ఆడిన క్రికెటర్ వేణుగోపాలరావు విశాఖ వాసి కావడం గమనార్హం. ఈయన సోదరుడు జ్ఞానేశ్వరరావు కూడా క్రికెటరే. ఆయన గతంలో ఇంగ్లాండ్ టూర్‌లో భారత్ అండర్ 19 క్రికెట్ టీమ్‌కి కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. అమిత్ సురీందర్ పాఠక్, బోడపాటి సుమంత్ లాంటి క్రికెటర్స్ కూడా వైజాగ్ వాసులే. ప్రస్తుతం విశాఖ పోతినమల్లయ్యపాలెంలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు ఎప్పుడూ వేదిక అవుతోంది.