MS Dhoni took Local Vaidya treatment for knee pains in Ranchi: టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన జార్ఖండ్ డైనమైట్.. గత కొంత కాలంగా మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నాడు. దీని కోసం ధోనీ ప్రపంచంలోని ఏ పెద్ద ఆసుపత్రిలోనో చికిత్స తీసుకోకుండా.. రాంచీలోని ఓ మారుమూల గ్రామంలో నాటువైద్యం చేయించుకుంటున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత కొంతకాలంగా రెండు కాళ్ల మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. దాంతో నాటువైద్యం కోసం మహీ.. రాంచీ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంపంగ్‌లోని స్థానిక నాటు వైద్యుడు వందన్ సింగ్ ఖేర్వార్ వద్దకు వెళుతున్నాడు. అక్కడ వనమూలికలతో చేసిన మందును తాగుతున్నాడు. ధోనీ ఇప్పటికే నాలుగు డోసులు తీసుకున్నాడు. ఒక్కో డోస్‌కి కేవలం రూ. 40 రూపాయలు చెల్లిస్తున్నాడు. మహీ శరీరంలో కాల్షియం లోపం ఉన్నందునే ఇలా జరుగుతుందని సదరు వైద్యుడు చెప్పాడు. 


నాటువైద్యం కోసం ఎంఎస్ ధోనీ స్వయంగా రాంచీ నుంచి 70 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ లాంపంగ్‌కు వెళుతున్నాడు. ఈ క్రమంలోనే జూన్ 26వ తేదీన నాటు వైద్యుడు వందన్ సింగ్ ఖేర్వార్ వద్దకు తన డోస్ తీసుకోవడానికి ధోనీ వెళ్ళాడు. మహీని గుర్తుపట్టిన అక్కడి జనం అతడి చుట్టూ గుమిగూడారు. ఆపై వారు మహీతో సెల్ఫీలు దిగి సంతోషపడ్డారు. ఆ ఫొటోస్ కాస్త నెట్టింట వైరల్ అవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మోకాళ్ల నొప్పికి చికిత్స కోసం ధోనీ తల్లిదండ్రులు కూడా అతని వద్దకు ఇదివరకు వెళ్లారట. వారికీ నయమవడంతో మహీ కూడా అక్కడికి వెళుతున్నాడు. 


నాటు వైద్యుడు వందన్ సింగ్ మాట్లాడుతూ... 'చికిత్స కోసం ఎంఎస్ ధోనీ నా వద్దకు మొదటిసారి వచ్చినప్పుడు నేను గుర్తించలేకపోయా. సాధారణ వ్యక్తిలా వచ్చి తన సమస్యను చెప్పాడు. మందు ఇస్తే తిన్నాడు. డోస్‌కి 40 రూపాయలు ఇచ్చాడు. ధోనీ కారు చూసి పక్కనే ఉన్న అబ్బాయిలు పెద్దగా అరిచారు. అప్పుడు కానీ విషయం తెలియలేదు. మోకాళ్ల నొప్పికి చికిత్స కోసం ధోనీ తల్లిదండ్రులు కూడా నా వద్దకు వచ్చారు. వారికి చాలా ఉపశమనంగా అనిపించడంతో మహీ కూడా వస్తున్నాడు' అని తెలిపాడు. 


Also Read: Sonali Bindre Rumours: ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. ఆ అవసరం నాకు లేదు: సోనాలి బింద్రె  


Also Read: Major OTT: ఓటీటీలోకి మేజర్‌.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.