డీజే బ్రావో ఛాంపియన్ ట్యూన్‌కి స్టెప్పేసిన ధోని కూతురు
ఛాంపియన్ ట్యూన్‌కి స్టెప్పేసిన జివా
క్రికెట్ ప్రపంచంలో డ్వేన్ బ్రావో ఎంత పాపులర్ క్రికెటరో తెలుసు. అంతేకాకుండా మ్యూజిక్ వీడియోల పరంగానూ బ్రావో పేరు ఎంతో పాపులర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బ్రావో మ్యూజిక్ వీడియోస్‌లో ఛాంపియన్ వీడియో ఇంకెంతో ప్రత్యేకమైనది. ఈ ట్యూన్‌కి ప్రపంచవ్యాప్తంగా వున్న మ్యూజిక్ లవర్స్, బ్రావో ఫ్యాన్స్ లేచి ఓ స్టెప్పేయాల్సిందే. అయితే తాజాగా మన మహేంద్ర సింగ్ ధోనీ గారాలపట్టి జివా కూడా అలా బ్రావో ఛాంపియన్ ట్యూన్‌కి స్టెప్పేస్తూ కనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.