Arjun Tendulkar Yorker: తాజా ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఘోరంగా విఫలమవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఇక ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై పని అయిపోయినట్లేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ముంబై వరుస ఓటములకు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా కారణం. ముంబై బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. అయితే అర్జున్ టెండూల్కర్ లాంటి యువ పేసర్, ఆల్ రౌండర్ నెట్స్‌లో అద్భుతంగా రాణిస్తున్నా.. ఇప్పటికీ అతన్ని టీమ్‌లోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్జున్ టెండూల్కర్ నెట్ ప్రాక్టీస్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబై ఇండియన్స్ ట్విట్టర్ ఖాతాలో దీన్ని షేర్ చేశారు. అందులో అద్భుతమైన యార్కర్‌తో అర్జున్ బ్యాటర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు... ఉనద్కత్‌కు బదులు అర్జున్‌ను టీమ్‌లోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉనద్కత్ దాదాపుగా ప్రతీ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడని... అతనికి బదులు అర్జున్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 


మరికొందరు నెటిజన్లు మిల్స్ స్థానంలో అర్జున్ టెండూలర్కర్‌ను తీసుకుంటే బెటర్ అని సూచించారు. ఇంకొందరు నెటిజన్లు.. అసలు అర్జున్‌ని టీమ్‌లోకి తీసుకోనప్పుడు... ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడమెందుకు అని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నిస్తున్నారు. 


కాగా, ఐపీఎల్‌లో రూ.20 లక్షలకు అర్జున్‌ను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ జట్టు.. ఇప్పటివరకూ అతనికి ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం ఇవ్వలేదు. అటు బ్యాట్‌తో, ఇటు బంతితో రాణించగల అర్జున్‌ని ఇప్పటికైనా జట్టులోకి తీసుకుంటే ఫలితం ఉండొచ్చునని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎలాగూ ముంబై వరుస ఓటముల్లో ఉంది కాబట్టి అర్జున్‌కి ఒక్క ఛాన్స్ ఇస్తే తప్పేంటని అడుగుతున్నారు. 



Also Read: Acharya Movie Update: మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'ఆచార్య' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు?


KGF Dialogue Wedding Card: కేజీఎఫ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే... ఏకంగా వెడ్డింగ్ కార్డుపై యశ్ డైలాగ్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.