IPL 2024-Suryakumar Yadav: ఐపీఎల్ సీజన్-17 స్టార్ట్ అవ్వకముందే ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ తగిలింది. టీ20 స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. రీసెంట్ గా జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్ట్ చేయించుకున్న సూర్య భాయ్ పూర్తి ఫిట్‌గా లేడని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అతడు తొలి రెండు మ్యాచులకు దూరమయ్యే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మూడో మ్యాచ్‌కి ముందు అతడు టీమ్ లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. స్టార్టింగ్ మ్యాచులకు సూర్య లేకపోవడం హార్ధిక్ సేనకు గట్టి దెబ్బనే చెప్పాలి. ప్రస్తుతం సూర్య ఫిట్‌నెస్ కసరత్తుల్లో పాల్గొంటున్నాడు. అయితే తొలి రెండు మ్యాచ్‌లకు ముందు ఎన్‌సీఏ అనుమతి ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 మార్చి 22 నుండి ప్రారంభమవుతుంది. ముంబై ఇండియన్స్ ఆదివారం (మార్చి 24) గుజరాత్ జెయింట్స్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది.


 ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఎన్. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మాధ్వల్, జాసన్ బెహ్రెండార్ఫ్, రొమారియో షెపర్డ్, రొమారియో షెపర్డ్. గెరాల్డ్ కోయెట్జీ, దిల్షన్ మధుశంక, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మహ్మద్ నబీ, శివాలిక్ శర్మ.


Also Read: Yashasvi Jaiswal: స్టార్ ఆటగాళ్లను వెనక్కి నెట్టి.. ఐసీసీ అవార్డు గెలుచుకున్న టీమిండియా కుర్ర హిట్టర్..


Also Read: T20 WC 2024: బీసీసీఐ బిగ్ స్కెచ్.. టీ20 ప్రపంచ కప్ నుంచి కోహ్లీ ఔట్.. కారణం ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి