Highest Earing Players in IPL: ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్లు వీళ్లే.. రోహిత్ శర్మ తరువాత ఎవరంటే..
Highest Earing Players in IPL: ఎంతోమంది క్రికెటర్లకు జీవితాన్నిచ్చింది ఐపీఎల్. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ప్లేయర్లు ఎందరో. ప్రపంచంలోనే అత్యధికంగా ఆటగాళ్లపై కాసులవర్షం కురిపిస్తోంది ఐపీఎల్ మాత్రమే. ఐపీఎల్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న టాప్-10 ఆటగాళ్లు వీళ్లే..
Highest Earing Players in IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఆదాయం సంపాదించిన ఆటగాడిగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనిని అధిగమించాడు హిట్‌మ్యాన్. ఐపీఎల్ నుంచి ఇప్పటివరకు రూ.178.6 కోట్లు సంపాదించాడు. రూ.176.84 కోట్లు సంపాదించాడు ధోనీ. ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న టాప్-10 క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం.
రోహిత్ శర్మ: ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాడు రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఐపీఎల్ ద్వారా రూ.178.6 కోట్లు సంపాదించాడు.
మహేంద్ర సింగ్ ధోని: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ధోనీ రూ.176.84 కోట్లు సంపాదించాడు.
విరాట్ కోహ్లీ: రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా సంపాదిస్తున్న మూడో ఆటగాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ ఐపీఎల్ ద్వారా రూ.173.2 కోట్లు అర్జించాడు.
సురేష్ రైనా: మిస్టర్ ఐపీఎల్‌గా పేరు తెచ్చుకున్న సురేష్ రైనా ఐపీఎల్ ద్వారా రూ.110 కోట్లు సంపాదించాడు. గతేడాది మెగా వేలంలో ఎవరూ తీసుకోకపోవడంతో ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పాడు.
రవీంద్ర జడేజా: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ నుంచి రూ.109 కోట్లు సంపాదించాడు. సీఎస్‌కే తరుఫున ఆడుతున్న జడేజాకు ఐపీఎల్‌లో మంచి క్రేజ్ ఉంది.
సునీల్ నరైన్: వెస్టిండీస్‌కు చెందిన సునీల్ నరైన్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కీలక ఆటగాడు. ఐపీఎల్ ద్వారా ఇప్పటివరకు రూ.107.2 కోట్లు సంపాదించాడు.
ఏబీ డివిలియర్స్: మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ నుంచి రూ.102.5 కోట్లు అర్జించాడు. బెంగుళూరు టీమ్‌కు ఆడిన ఏబీడీ.. ఆ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.
గౌతమ్ గంభీర్: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల తరఫున ఆడాడు. ప్రస్తుతం లక్నో సూపర్ జాయింట్స్ జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు. గౌతమ్ గంభీర్ ఐపీఎల్ నుంచి ఆటగాడిగా రూ.94.62 కోట్లు సంపాదించాడు.
శిఖర్ ధావన్: భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. శిఖర్ ధావన్ ఐపీఎల్ ద్వారా రూ.91.8 కోట్లు సంపాదించాడు.
దినేష్ కార్తీక్: సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఈ జాబితాలో 10వ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ ద్వారా దినేష్ కార్తీక్ రూ.86.92 కోట్లు అర్జించాడు.
Also Read: Pele Death: లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే కన్నుమూత.. శోకసంద్రంలో క్రీడా ప్రపంచం
Also Read: LIC Merger: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నాలుగు ప్రభుత్వ బీమా కంపెనీలు ఎల్‌ఐసీలో విలీనం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి