Fans shout Dinesh Karthik name in front of Murali Vijay: భారత వెటరన్ క్రికెటర్ మురళీ విజయ్‌కి చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ (టీఎన్‌పీఎల్)లో రూబీ ట్రిక్కి వారియర్స్‌ జట్టుకు ఆడుతున్న విజయ్‌ను మైదానంలో అభిమానులు ఓ ఆటాడుకున్నారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విజయ్‌ ముందే.. డీకే (దినేష్ కార్తీక్) అంటూ పదేపదే అరిచారు. దీంతో ఫీల్డింగ్ చేస్తున్న విజయ్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడుకు చెందిన దినేష్ కార్తీక్, మురళీ విజయ్‌ మంచి స్నేహితులు. కార్తీక్ టీమిండియా సెకండ్ వికెట్ కీపర్‌గా, తమిళనాడు కెప్టెన్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ‌సమయంలో విజయ్.. డీకే మొదటి భార్య నిఖిత వంజరతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం కార్తీక్‌కు తప్ప అందరికీ తెలుసు. విజయ్ కారణంగా గర్భం దాల్చినట్లు చెప్పి విడాకులు ఇవ్వాలని డీకేను నిఖిత కోరింది. విడాకులు తీసుకున్న ఆమె విజయ్‌తో సహజీవనం మొదలుపెట్టింది. ఆపై ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.


ఊహించని పరిణామంతో దినేశ్ కార్తీక్ డిప్రెషన్‌కు లోనయ్యాడు. దాంతో డీకే ప్రదర్శన దెబ్బతిని టీమిండియాలో చోటు కోల్పోయాడు. ఐపీఎల్‌లోనూ విఫలమయ్యాడు. విషయం తెలుసుకున్న డీకే ట్రైనర్.. హితబోధ చేశాడు. ట్రైనర్ సూచనలతో జిమ్‌ చేయడం మొదలుపెట్టిన కార్తీక్‌కు భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ పరిచయమైంది. డీకే స్టోరీ తెలుసుకొని అతడికి అండగా నిలిచింది. కోలుకున్న డీకే అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు ఎంపికవ్వడంతో పాటు కేకేఆర్ కెప్టెన్సీ కూడా అందుకున్నాడు. ఆపై కొన్ని కష్టాలు ఎదురైనా.. వాటిని అధిగమించి ఇప్పుడు భారత జట్టుకు ఫినిషర్ అవతారమెత్తాడు. 



ప్రస్తుతం భారత జట్టుకు ఫినిషర్ రోల్ పోషిస్తున్న డీకేకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అతడు క్రీజులోకి వస్తుండగానే ఫ్యాన్స్ డీకే, డీకే అంటూ మైదానాన్ని హోరెత్తిస్తున్నారు. అదే సమయంలో డీకేను వంచించిన మురళీ విజయ్‌ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకున్నారు. క్రమంలోనే తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న విజయ్‌ను ఫ్యాన్స్ ఎగతాళి చేశారు. ఫీల్డింగ్ చేస్తున్న విజయ్ ముందే.. పదేపదే డీకే పేరు జపించడంతో అతడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. వ్యక్తిగత విషయాలను ప్రస్తావించొద్దంటూ దండం పెట్టి వేడుకున్నాడు. అయినా ఫాన్స్ ఊరుకోలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


Also Read: సూర్య, శార్దూల్ ఔట్.. ఇషాన్‌కు చోటు! భారత్ తుది జట్టు, డ్రీమ్ ఎలెవన్ టీమ్ ఇదే


Also Read: Telangana Politics : శ్రావణమాసంలో ఆ పార్టీలోకి లీడర్ల క్యూ...?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.