Musheer Khan breaks Sachin Tendulkar's Ranji Trophy record: విదర్భతో వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైన‌ల్లో ముంబై బ్యాట‌ర్ ముషీర్ ఖాన్(Musheer Khan)  క్రికెట్ గాడ్ సచిన్ టెండ్యూల్కర్ రికార్డును బద్దలుకొట్టాడు. రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సెంచరీ కొట్టిన అతి పిన్న వయస్కుడైన ముంబై బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. మాస్టర్ బ్లాస్టర్ ఈ ఫీట్ ను 21 ఏళ్ల వయసులో సాధిస్తే..  ముషీర్ ఖాన్ కేవలం 19 ఏళ్ల 14 రోజుల వయసులోనే చేసి చూపించాడు. దీంతో 29 ఏళ్ల సచిన్ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. 1994-95లో పంజాబ్‌పై టెండూల్కర్ 140 పరుగులు చేశాడు. తాజాగా విదర్భతో జరుగుతున్న ఫైనల్లో ముషీర్ 136 పరుగుల చేశాడు.  ముషీర్ సోద‌రుడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ప్ర‌స్తుతం టీమిండియాకు ఆడుతున్న సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయం దిశగా ముంబై..
వాంఖేడ్ లో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్ లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. పృథ్వీ షా(46), శార్థూల్ ఠాకూర్(75) మాత్రమే రాణించారు. హర్ష దుబే, యశ్ ఠాకూర్ మూడేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత ముంబై బౌలర్ల ధాటికి విదర్భ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 105 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు యశ్ రాథోడ్ (27) టాప్ స్కోరర్.


అనంతరం రెండో ఇన్ని్ంగ్స్ ప్రారంభించిన ముంబై ముషీర్ సెంచరీతో భారీ స్కోరు సాధించింది. శ్రేయస్ అయ్యర్ (96) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కెప్టెన్ రహానే 73, ములానీ 50 పరుగులతో సత్తా చాటాడు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ లో ముంబై 418 పరుగులకు ఆలౌటైంది. హార్ష దుబే ఐదు వికెట్లు తీశాడు. 538 పరుగుల భారీ టార్గెట్ తో రెండో ఇన్నింగ్ మెుదలుపెట్టిన విదర్భ ప్రస్తుతం నాలుగు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. గెలవాలంటే ఆ జట్టు 356 పరుగులు చేయాల్సి ఉంది.  ప్రస్తుతం కరుణ్ నాయర్(51),  వాడేకర్(25) క్రీజులో ఉన్నారు. ఇంకా ఇంకో రోజు ఆట మిగిలి ఉంది. 



Also Read: Pak Cricketer: దేశంలో అమల్లోకి వచ్చిన CAA... మోదీకి థ్యాంక్స్ చెప్పిన పాక్ క్రికెటర్..


Also Read: IPL 2024: ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్.. ఐపీఎల్ కు టీ20కా బాప్ దూరం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి