IPL-2021: బుధవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్ రెహ్మాన్(mustafizur Rahman) అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో.. గ్లెన్ మాక్స్‌వెల్ బంతిని లాంగ్ లెగ్ దిశగా భారీ షాట్‌ ఆడడానికి ప్రయత్నించాడు. అయితే బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న ముస్తాఫిజుర్ సరైన సమయంలో జంప్ చేసి ఆ బంతిని సిక్స్‌(Six)గా వెళ్లకుండా అడ్డుకున్నాడు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Viral videos: ఇయాన్ మోర్గాన్‌తో Ravichandran వాగ్వాదం.. సర్దిచెప్పిన Dinesh Karthik


దీంతో సిక్స్‌కు బదులుగా  సింగిల్‌ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియా(Social Media)లో తెగ వైరల్‌ అవుతోంది. ముస్తాఫిజుర్ సూపర్‌ ఫీల్డింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా ​రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు(Royal Challengers Bangalore)తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajastan royals) 7 వికెట్ల తేడాతో  పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌(58), యశస్వి జైస్వాల్‌(31) శుభారంభం అందించినప్పటికీ.. మిడిలార్డర్‌ దారుణంగా విఫలమైంది.  తర్వాత 150 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి  దిగిన బెంగళూరు కేవలం మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook