Namibia Squad: నమీబియా తరఫున ఆడనున్న డుప్లెసిస్, డివిలియర్స్.. జట్టులో పేర్లు ప్రకటన..!
Faf Du Plessis And De Villiers in Namibia Team: నమీబియా టీమ్‌లో ఫాఫ్ డుప్లెసిస్, డివిలియర్స్ చోటు దక్కించుకున్నారు. అయితే వీరిద్దరు సఫారీ క్రికెటర్లు కాదండోయ్. అండర్-19 టీమ్ ఆటగాళ్లు. అండర్-19 ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లకు నమీబియా జట్టులోకి ఈ యంగ్ ప్లేయర్లను తీసుకున్నారు.
Faf Du Plessis And De Villiers in Namibia Team: వరల్డ్‌కప్‌కు అర్హత సాధించేందుకు నమీబియా జట్టు రెడీ అయింది. క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లు ఆడేందుకు నమీబియా టీమ్‌ను అనౌన్స్ చేశారు. అయితే ఈ జట్టులో ఫాఫ్ డుప్లెసిస్, డివిలియర్స్‌లకు చోటు కల్పించింది. అదేంటి వీరిద్దరు సౌతాఫ్రికా క్రికెటర్లు కదా అనుకుంటున్నారా..? డుప్లెసిస్, డివిలియర్స్ పేర్లను చేర్చింది నిజమే. కానీ దక్షిణాఫ్రికా ప్లేయర్లు కాదు. అండర్-19 ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌ల మ్యాచ్‌లో ఇద్దరు యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. వారి పేర్లు హాన్సీ డివిలియర్స్, ఫాఫ్ డుప్లెసిస్. దీంతో క్రికెట్ అభిమానులు నమీబియా జట్టులోకి స్టార్ క్రికెటర్లు డుప్లెసిస్, డివిలియర్స్ వచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అండర్-19 ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లకు టాంజానియా ఆతిథ్యం ఇస్తోంది. నైజీరియా, సియెర్రా లియోన్, కెన్యా, ఉగాండా, టాంజానియా జట్లతో నమీబియా పోటీ పడనుంది. ఈ టోర్నమెంట్ జూలైలో నిర్వహించనున్నారు. అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్ 2024లో జరగనుంది. ఈ ప్రపంచ కప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2024లో మొత్తం 16 జట్లు పాల్గొనబోతున్నాయి.
క్వాలిఫయర్స్ కోసం నమీబియా జట్టు ఇదే..
అలెగ్జాండర్ వోల్షెయిన్ (కెప్టెన్), గెర్హార్డ్ జాన్సే వాన్ రెన్స్‌బర్గ్ (వైస్ కెప్టెన్), అడ్రియన్ లోవ్, ఫాఫ్ డుప్లెసిస్, ఫ్రాంకో బెర్గ్, హెన్రియో బాడెన్‌హార్స్ట్, హాన్సీ డివిలియర్స్, జాక్వెస్ బ్రాసెల్, జూనియర్ కరీటా, జెడబ్ల్యు విస్సాగి, పీటర్ డేనియల్ బ్లిగ్నోట్, ర్యాన్ మోఫెట్టస్, వౌటీ నీహాస్, జాక్సియో జాన్సెన్ వాన్ వురెన్
ఐపీఎల్‌లో దుమ్ములేపిన డుప్లెసిస్
ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుతమైన ఫామ్‌తో ఆకట్టుకున్నాడు. ఆరెంజ్ క్యాప్‌లో రెండోస్థానంలో నిలిచాడు. 14 మ్యాచ్‌ల్లో 153.68 స్టైక్‌రేట్‌తో 730 పరుగులు చేశాడు. 56.15 సగటుతో 8 అర్ధ సెంచరీలు బాదడం విశేషం. డుప్లెసిస్‌కు తోడు విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్ రాణించినా మిగిలిన ఆటగాళ్లు విఫలమవ్వడంతో ఆర్‌సీబీ జట్టు ఈ సీజన్‌లో లీగ్ దశలోనే నిష్క్రమించింది.
Also Read: PF Withdrawal: పీఎఫ్ నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి