Hardik Pandya Natasa Stankovic Divorce: భారత అగ్ర శ్రేణి ఆటగాడు హార్దిక్‌ పాండ్యా క్రికెట్‌పరంగా.. వ్యక్తిగత జీవితంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తన సారథ్యంలో ముంబై ఇండియన్స్‌ జట్టును ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అయితే ఆటపరంగా అతడు శ్రద్ధ కనబర్చకపోవడానికి కారణం వ్యక్తిగత జీవితంలో భారీ ఎదురుదెబ్బ తగులుతోందని సమాచారం. తాను ప్రేమించి డేటింగ్‌ చేసి.. పెళ్లి చేసుకున్న భార్య నటాషా స్టాంకోవిక్‌ విడాకులు తీసుకోబోతున్నదని సమాచారం. కొన్ని రోజులు హార్దిక్‌, నటాషా విడాకుల వార్త ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ వార్తలపై నటాషా స్పందించింది. ఓ స్నేహితుడితో కలిసి బయటకు వచ్చిన నటాషా విడాకుల విషయమై 'థ్యాంక్యూ' అంటూ వెళ్లిపోయింది. నటాషా స్పందన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా హార్దిక్‌ విడాకుల వార్తలు కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kavya Maran Crying: గుండెల్ని పిండేసే సన్నివేశం.. కన్నీళ్లు పెట్టుకున్న కావ్య పాప


సెర్బియా దేశానికి చెందిన మోడల్‌ నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్‌ ప్రేమ వ్యవహారాలు నడిపించాడు. అనంతరం వీరిద్దరూ కలిసి రెండేండ్లు సహజీవనం చేశారు. ఆ తర్వాత 2020లో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వారికి ఒక బాబు ఉన్నాడు. సవ్యంగా సాగుతున్న వారి కాపురంలో కొన్ని నెలలుగా కలహాలు మొదలయ్యాయి. వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. వీరిద్దరూ విడిపోవాలని దాదాపుగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నటాషా తన సోషల్‌ మీడియాలో హార్దిక్‌తో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను తొలగించింది. ఇంకా పేరు పక్కన పాండ్యా అనే పేరును తీసేసింది. ఇటీవల 'ఒకరు రోడ్డున పడబోతున్నారు' అని ఒక పోస్టు చేసింది. అంటే హార్దిక్‌ పాండ్యా తన ద్వారా రోడ్డున పడనున్నాడని ముందే హెచ్చరించినట్లు సమాచారం.

Also Read: IPL 2024 Prize Money: చాంపియన్‌ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కు, రన్నరప్‌ హైదరాబాద్‌కు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?


కాగా రోడ్డు పక్కన కనిపించిన నటాషాను హార్దిక్‌ పాండ్యాతో విడాకుల విషయమై మీడియా ప్రశ్నించింది. ఆమె స్పందించేందుకు నిరాకరించారు. కానీ మీడియా వదలలేదు. హార్దిక్‌తో విడాకులు తీసుకుంటున్నారా? అని పదే పదే ప్రశ్నించడంతో 'థ్యాంక్యూ', 'థ్యాంక్యూ గాయ్స్‌' అంటూ కారు ఎక్కేసి వెళ్లిపోయింది. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. హార్దిక్‌తో విడాకులు తీసుకోవాలని నటాషా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


భారీగా ఆస్తి నష్టం?
విదేశస్తురాలిని పెళ్లి చేసుకోవడంతో హార్దిక్‌ పాండ్యా ఒకవేళ విడాకులు ఇస్తే మాత్రం భారీగా ఆస్తిని కోల్పోవాల్సి వస్తుంది. విదేశీయురాలితో విడాకులు తీసుకుంటే దాదాపు 70 శాతం ఆస్తులు భరణం కింద రాసి ఇవ్వాల్సి ఉంది. ఆ విధంగా చట్టాలు ఉన్నాయి. విడాకులు పొందితే మాత్రం హార్దిక్‌ పాండ్యా నటాషాకు 70 శాతం ఆస్తులు భరణం కింద ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది ముందే గ్రహించిన హార్దిక్‌ తన ఆస్తులన్నిటిని తన తల్లి పేరిట రాయించుకున్నాడు. తాను సంపాదించిన ప్రతి రూపాయిలో 50 పైసల్‌ తన తల్లి పేరిట ఉంటాయని చాలాసార్లు చెప్పాడు. ఇప్పటికీ తన తల్లి పేరిటనే హార్దిక్‌ తన ఆస్తులను రిజిస్టర్‌ చేయించాడు. ఇప్పుడు అదే హార్దిక్‌ మేలు చేసే అవకాశం ఉంది. తల్లి పేరిట సగం ఆస్తులు ఉండగా.. హార్దిక్‌ పేరిట తక్కువ ఆస్తులు ఉన్నాయి. విడాకులు పొందితే మాత్రం కేవలం హార్దిక్‌ పేరు మీద ఉన్న ఆస్తుల్లో 70 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. భరణం కింద తన ఆస్తులు కోల్పోయినా తల్లి పేరిట భద్రంగా ఉండడంతో హార్దిక్‌కు పెద్దగా నష్టం ఉండే అవకాశం లేదు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter